అవినీతిలో నెంబర్‌ వన్‌ చంద్రబాబు..


నాలుగున్నరేళ్లుగా రాజ్యాంగానికి తూట్లు..
జాతీయపార్టీలు చంద్రబాబు చ్రరిత తెలుసుకోవాలి




హైదరాబాద్ః చంద్రబాబు పాలనలో ఏపీ అవినీతి కంపు కడుతోందని  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి రాజశేఖర్‌ రెడ్డి మండిపడ్డారు. నాలుగేన్నరేళ్లగా రాజ్యాంగానికి, చట్టానికి తూట్లు పోడుస్తున్న  చంద్రబాబు దేశ ప్రయోజనాలు గురించి మాట్లాడటం హస్యాస్పదంగా ఉందన్నారు. లోటస్‌పాండ్‌లో వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో చిత్తుగా ఓడిపోతామని తెలిసి చంద్రబాబు జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబుతో కలిసిన రాష్ట్ర,జాతీయ పార్టీలు ఆయన చ్రరిత గురించి తెలుసుకుని ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాలను ధిక్కరించిన చంద్రబాబు  రాష్ట్ర,దేశ ప్రయోజనాలు కోసమంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవినీతి,అక్రమాలపై వైయస్‌ఆర్‌సీపీ చేసిన ఆరోపణలకు చంద్రబాబు హయాంలో పనిచేసి నిజాయతీ గల అధికారులుగా గుర్తింపు పొందిన  నాలుగు సీఎస్‌లు చేసిన ఆరోపణలు బలం చేకూరుతున్నాయన్నారు. భారతదేశ చ్రరితలో  ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై మాట్లాడటం సీఎం చంద్రబాబు పైనే అని అన్నారు. ఉపాధిహామీ పథకంలో 7వేల కోట్లకు అవినీతి జరిగిందన్నారు.  ఒక మీడియా సంస్థకు 700 కోట్ల ధారపోశారన్నారు. రూ.450 కోట్ల భూమిని రూ. 45 లక్షలకే అప్పనంగా అప్పగించారన్నారు. దీనికి సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా మారుతుందన్నారు. రూ.60 వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రానికి   గుదిబండగా మార్చారని దుయ్యబట్టారు. రాజదాని పేరుతో  రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ.. పంటలను తగులబెట్టించి రైతులతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణులు,వెశ్యుల  భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. టీడీపీ మంత్రివర్గంలో పనిచేస్తున్న అయ్యన్నపాత్రుడు కూడా సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు మీద ఆరోపణలు చేస్తున్నా ఏమీ చేయలేని నిస్సయస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. అసమర్థతను చాటి చెపుతోందన్నారు. చంద్రబాబు అవినీతినిలో నెంబర్‌ వన్‌  జాతీయ సంస్థలు చెబుతున్నాయన్నారు. చంద్రబాబు పరిపాలనలో బీహర్‌లో కన్నా దారుణంగా అవినీతి జరుగుతుందని జాతీయ సంస్థలు బట్టబయలు చేస్తున్నాయన్నారు. జన్మభూమి కమిటీపేరుతో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. జడ్పిటీసీలు,ఎంపిటీసీలు,మున్సిపల్‌ కౌన్సిలర్లను కొనుగోలు చేసి వ్యవస్థను అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు.  23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పోడిచారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో ఎంతగా అవినీతి జరుగుతుందో  కాగ్‌ నివేదికలో  బట్టబయలు అయ్యిందన్నారు. రోజుకో పార్టీతో కలుస్తూ గోడమీద పిల్లిగా చంద్రబాబు వ్యహరిస్తున్నారన్నారు.. పొత్తులతో రాష్ట్రం పరువు తీస్తున్నారన్నారు.గతంలో వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి వ్యవస్థలు ద్వారా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, అయినా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధైర్యంగా ముందుకు వెళ్తూ ప్రజల కోసం కష్టపడుతున్నారన్నారు. 2019లో  వైయస్‌ జగన్‌ విజయం తధ్యమని భావించి నీచంగా ఒక ప్రతిపక్ష నాయకుడిపై  హత్యయత్నం చేయించడానికి కూడా చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని దృష్టి మరల్చడానికి, ప్రభుత్వ వైఫల్యాలను  కప్పిపుచ్చుకోవడానికి దేశ ప్రయోజనాలు అంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారన్నారు.  ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా చంద్రబాబు పాలన సాగుతుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top