బాబు ప్రకృతి విధ్వంసకుడు

బ్రిటీష్ టైంలో ఏర్పాటు చేసిన సుంకేశుల, కేసీ కెనాల్ సహా రాయలసీమలో చుక్క నీరు లేక వేలాది ఎకరాల పంట ఎండిపోయిందని వైయస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ కూడ తిరిగి చూడని  వ్యవసాయ మంత్రి, కేబినెట్ మంత్రులు వీళ్లా అభివృద్ధి గురించి మాట్లాడేదని ప్రజలే స్వయంగా అనుకుంటున్నారని అన్నారు. బాబు ప్రకృతి విధ్వంసకుడని దుయ్యబట్టారు. బాబు ముఖ్యమంత్రిగా ఉండగా కరువే తప్ప రాష్ట్రంలో మరొకటి లేదని గతంలోనూ, ఇప్పుడు నిరూపితమైందన్నారు. బాబు ప్రచారనికి వచ్చిన దగ్గర్నుంచి చుక్క నీరు లేదు. వైయస్ఆర్ హయాంలో రాయలసీమకు నీళ్లు వచ్చి రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. వైయస్ జగన్ నంద్యాలకు వచ్చాక జోరుగా వర్షం కురిసి, కొన్ని వందల కోట్ల రూపాయల పంటను కాపాడిందని అన్నారు. వైయస్సార్సీపీదే విజయమని నంద్యాల ప్రజలు భావిస్తున్నారు. మూడున్నరేళ్లలో బాబు పాలనలో ఒక్క ఎకరానికైనా సాగునీరు వచ్చింది లేదు. మిర్చీ, మినుము, శనగ ధరలు కుప్పకూలి రైతాంగం సంక్షోభంలో ఉంది. బాబు అభివృద్ధి చేశామని అబద్ధాలు చెబుతున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నంద్యాలలో వైయస్సార్సీపీ విజయాన్ని ప్రజలుముందే  డిసైడ్ చేశారు

Back to Top