గాంధీజీ అంటే చంద్రబాబుకు భయం


చంద్రబాబు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అన్నా విలువ లేదు
150 దేశాలు గాంధీని గౌరవిస్తుంటే.. ఏపీ సీఎం కించపరుస్తున్నారు
చంద్రబాబు వైఖరి గాంధేయ మార్గానికి విరుద్ధం
125 అడుగు అంబేడ్కర్‌ విగ్రహానికి ఇప్పటికీ అతీగతి లేదు
ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ దళితులపై చిన్నచూపు
స్పీకర్‌ కోడెల గాంధీ విగ్రహ ఏర్పాటుకు సహకరించకపోవడం దారుణం
జయంతి.. వర్ధంతికి తేడా తెలియని లోకేష్‌కు గ్రామీణాభివృద్ధి శాఖా ఎందుకు
తండ్రీకొడుకులు ఇద్దరూ దోచుకోవడానికే పుట్టినట్లున్నారు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

విజయవాడ: చంద్రబాబుకు మహాత్మాగాంధీ అంటే భయమని, అందుకే అసెంబ్లీ ముందు మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేయలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్‌ నుంచి అమరావతికి పారిపోయి వచ్చిన రోజే చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అన్నా.. గాంధేయ మార్గమన్నా గౌరవం లేదని, కనీసం విలువలు కూడా ఇవ్వడని చెప్పామని గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాలుగా ఏ రోజు కూడా గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ఆలోచన కూడా చేయలేదన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం యావత్తు గాంధీజీకి ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తే చంద్రబాబు మాత్రం అసలు పట్టించుకోవడం లేదన్నారు. సుమారు 150 దేశాలు గాంధీ బొమ్మతో పోస్టల్‌ స్టాంపులను విడుదల చేశాయన్నారు. 200ల సంవత్సరాలు పాలించిన బ్రిటీష్‌ వారు కూడా వారి పార్లమెంట్‌ ముందు గాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఐక్యరాజ్యసమితి గాంధీ విగ్రహం పెట్టడమే కాకుండా అక్టోబర్‌ 2 గాంధీ జయంతిని ప్రపంచ శాంతి దినోత్సవంగా ప్రకటించిందన్నారు. 

దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం మినహా మిగిలిన రాష్ట్రాల్లో అసెంబ్లీల ముంద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేశారని ఆర్కే చెప్పారు. ప్రపంచ దేశాలు కూడా గాంధీకి గౌరవం ఇస్తుంటే.. చంద్రబాబు అసలు పట్టించుకోకపోవడం భావ్యమా అని ప్రశ్నించారు. చంద్రబాబు గాంధీని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆలోచిస్తే గాంధేయ మార్గం శాంతి, సత్యం, అహింస, నీతి, న్యాయం. . ఈ లక్షణాలు చంద్రబాబుకు పనికి రావు.. అవి చెప్పేవాళ్లు అంటే కోపం అందుకే గాంధీ విగ్రహం పెట్టలేదన్నారు. తెల్లవారి లేస్తే దోపిడీ, అప్రజాస్వామిక విధానాలు కాబట్టి ఉదయాన్నే గాంధీ విగ్రహం చూస్తే చెంప చెల్లున కొట్టుదనే భయంతోనే విగ్రహం పెట్టలేదన్నారు. 

అమరావతిలో 125 అడుగు అంబేడ్కర్‌ విగ్రహం అని ప్రకటించిన చంద్రబాబు ఇప్పటికీ అతీగతి లేదన్నారు. కేవలం స్టేట్‌మెంట్‌తో దళిత సామాజిక వర్గ మెప్పు పొందడానికి కుయుక్తులు పన్నుతున్నాడన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయకపోగా.. దళితులను కించపరిచే విధంగా ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. దేవాలయం లాంటి అసెంబ్లీ ముందు గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహం పెట్టకపోవడం దుర్మార్గమన్నారు. 

దేశానికి గ్రామాలే వెన్నుముక అని గాంధీ చెబితే.. చంద్రబాబు అర్హత లేకపోయినా అడ్డదారిలో ఆయన కొడుకు లోకేష్‌కు కీలకమైన పంచాయతీరాజ్‌ శాఖను కట్టబెట్టాడన్నారు. అనుభవం ఉన్న వ్యక్తులకు పంచాయతీరాజ్‌ మంత్రి పదవులు ఇస్తారని, ఎప్పుడు ఎన్నికలు పాల్గొనలేదు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని లోకేష్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రిని చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు కంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన నాయకులు నేటికీ అసెంబ్లీలో ఉన్నా వారికి మంత్రి పదవులు దక్కలేదన్నారు. కొడుకుకు S మాత్రం అడ్డదారిలో అంటగట్టాడని మండిపడ్డారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్‌ రెండు వ్యవస్థలను నిర్వీర్యం చేసి గాంధీ చెప్పిన మాటలను తుంగలో తొక్కుతూ గ్రామ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ లక్షల కోట్ల అవినీతి కొడుకు ద్వారా చంద్రబాబు చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. 
గ్రామాల్లో మద్యపాన నిషేదం గాంధీజీ ముఖ్య ఉద్దేశమని, అలాంటిది చంద్రబాబు పాలనలో వీధి వీధికి బెల్ట్‌షాపు వెలిశాయని ఆర్కే మండిపడ్డారు. గతంలో దివంహాత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మైనర్‌ పంచాయతీల విద్యుత్‌ బిల్లులు కట్టేవారని, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో అది లేదన్నారు. ఎల్‌ఈడీ బల్బుల పేరుతో వెయ్యి కోట్ల అవినీతి, ఇసుకను దోచుకుంటున్నారు. మట్టిని తింటున్నారు. నీటిని ఇష్టం వచ్చినట్లుగా మళ్లించుకుంటూ కోట్లు దండుకుంటున్నారని దుయ్యబట్టారు. పుట్టిందే అన్యాయం,, అవినీతి కోసం అన్నట్లుగా తండ్రీకొడుకులు దోచుకుతింటున్నారన్నారు. 

గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు కూడా ఆలోచన రాకపోవడం దారుణమన్నారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్‌లో ఉన్న చట్టాన్ని అమలు చేయాలని కోరితే ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పినా చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు అంటే భయం ఉంటే చట్టం చూపించి అనర్హత వేటు వేయాలని సూచించారు. గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఎందుకు సహకరించలేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్‌ సత్తెనపల్లి నియోజకవర్గంలో కాంట్రాక్టర్‌లను బెదిరించడం. నరసరావుపేట, సత్తెనపల్లిలో వేల కోట్ల దోపిడీ చేస్తున్నారన్నారు. చంద్రబాబును చూసి ఆయన కొడుకు దోపిడీకి తెగబడినట్లుగా.. కోడెలను చూసి ఆయన కొడుకు కూడా దోపిడీ దారి పట్టాడన్నారు. కోడెల కూతురు కూడా హెల్త్‌ విభాగంపై పడి విచ్చలవిడిగా దోచుకుంటుందన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉండి అన్ని అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. గాంధీ విగ్రహానికి సహకరించకపోగా.. స్పీకర్‌ స్థానంలో ఉండి చంద్రబాబు ఫొటోలకు పాలాభిషేకం చేస్తున్నాడన్నారు. 

అసెంబ్లీ ఆవరణలో తక్షణమే మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆర్కే డిమాండ్‌ చేశారు. 3వ తేదీన కేబినెట్‌ మీటింగ్‌ జరుగుతుందని తెలిసిందని, ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. గాంధీజీకి విలువ ఇవ్వాలనే జ్ఞానం ఉంటే చంద్రబాబుకు ఎటూ బుద్ధి, జ్ఞానం లేదు.. కనీసం మంత్రులైనా గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాల ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబుపై ఎదురుతిరగాలని విజ్ఞప్తి చేశారు. 
Back to Top