చంద్రబాబు ఏపీకి శత్రువు..

ఢిల్లీః నాలుగు సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు ఏపీకి అన్యాయం చేశాడని వైయస్‌ఆర్‌సీపీ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిగత డిమాండ్లు, కోరికలు తీర్చలేదని బీజేపీతో వేరపడ్డారన్నారు  నేడు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతీనే విధంగా ఇతర పార్టీలతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు.ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు మనం హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉందని కాని..  కేవలం నోటుకు ఓటు కేసుకు భయపడి  పెట్టి,బెడ సర్ధుకుని అమరావతికి తరలించారని దుయ్యబట్టారు. అమరావతిలో  కనీసం సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.  కేవలం కేసులకు భయపడి విజయవాడకు చంద్రబాబు పరుగెత్తుకు వచ్చాడని విమర్శించారు. దీంతో  లక్షల కోట్లు రూపాయలు దుర్వినియోగం అవ్వడంతో పాటు. రావలసిన ఆదాయం రాలేకపోయిందన్నారు. ఏపీని విభజించినప్పుడు చట్టసభలో రూపొందించిన వెసులుబాటు,పథకాలు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయాలు ఏపీకి రావాల్సిన ఉందని ఆదాయాన్ని చంద్రబాబు పొగొట్టారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో మోదీని పొగుడుతూ చేసిన తీర్మానాలు  ఉన్నాయి .కుంటిసాకులు చూపించి ప్రత్యేకహోదా తుంగలో తొక్కి  రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు.ఏపీకి శత్రువుకు చంద్రబాబు అని, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారన్నారు. పోలవరం ప్రాజెక్టు  కాంట్రాక్ట్‌ కోసం ప్రత్యేకహోదాను చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  40 సంవత్సరాలు అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు దోపిడీదార్లును తయారుచేయడంలో అనుభవం వచ్చిందన్నారు.
Back to Top