పేదవాడు సంతోషంగా ఉండడమే నాకు తెలిసిన అభివృద్ధిమేనిఫెస్టోలో ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో పెట్టాడుముఖ్యమంత్రి సీటు కోసం ప్రజలను పచ్చిగా వంచించాడుఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా...?దళితులపై విపరీతంగా పెరిగిన దాడులుఅత్తగారి సొత్తులా భూములు లాక్కోవడం, నిధుల వాడకంనీరు–చెట్టు పథకం టీడీపీ కార్యకర్తలు నిండా భోజనం చేయడమేకమీషన్లు ఇస్తారని కాంట్రాక్టర్‌లకు రేట్లు పెంచుతారుఅవ్వాతాతల పింఛన్‌లో కమీషనర్ రాదని పెంచడం లేదా?నవరత్నాలు ప్రకటించా.. అందరికీ అండగా ఉంటా..మీ పిల్లలను దగ్గరుండి చదివించి మీ తలరాతలు మారుస్తావైయస్ఆర్ కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకేస్తా..ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి

చిత్తూరు: ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎవరైనా ఒక సబ్జెక్టు నుంచి ఎంచుకొని దానిలో ఉత్తీర్ణులైన తరువాత డాక్టరేట్ ఇస్తారని, అలాగే బాబు ఎంచుకున్న టాపిక్ ప్రజలను మోసం చేయడమని, దాంట్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పల్లమాలలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీలతో ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు. ఈ సందర్భంగా జననేత ఎస్సీలను ఉద్దేశించి ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే... చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పరిపాలన చూశాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏం చెప్పాడో విన్నాం.. ఎన్నికల ప్రణాళికలో ప్రతికులాన్ని ఎలా మోసం చేయాలోనని పీహెచ్‌డీ చేశారు. ప్రజలను ఎలా మోసం చేయాలనే సబ్జెక్ట్‌పై చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. ముఖ్యమంత్రి కావడం కోసం రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, చివరకు చదువుకునే పిల్లలను, నిరుద్యోగులను ఎవరినీ వదిలిపెట్టలేదు. ఒక్కో కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలనే ఆలోచనతో కదలికలు జరిగాయి. – చంద్రబాబు ఎన్నికలప్పుడు ఆయనే డోలు కొడతాడు. నేనే పెద్ద కొడుకును అంటాడు.. ఎన్నికలు అయిపోయిన తరువాత మన భూములు వాళ్ల అత్తగారి సొత్తు అన్నట్లుగా లాక్కునే ప్రయత్నం చేస్తాడు. – ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి భూములు ఇస్తామన్నాడు. పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇల్లు కట్టిస్తానన్నాడు. – ఎవరైనా షెడ్యుల్ కులాలకు సంబంధించి పరిశ్రమలు పెట్టడానికి ముందకు వస్తే రూ. 5 కోట్ల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నాడు. ఎస్సీలను, ఎస్టీలను మోసం చేశాడు. – ఒక సారి ఆలోచన చేయండి ఇదే పెద్ద మనిషి నాలుగేళ్లు అయిపోయింది . బాబు పాలనలో మన బతుకులు మంచి కోసం మారాయా.. గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. – ప్రతి పేదవాడు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి - నాకు తెలిసింది అదే. కానీ చంద్రబాబుకు తెలిసింది ప్రతి పేదవాడు నిన్నటికంటే ఇవాళ బాధపడితేనే అభివృద్ధి. – దళితుల గురించి పేద వాడి గురించి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచన చేయాలి. – నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఒక మంత్రి ఆదినారాయణ రెడ్డి అంట ఆయన పేరు.. విన్నారా ఎప్పుడైనా..? ఆ మంత్రి అంటాడు దళితులు స్నానం చేయరంట. చదువుకోరంట. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి మీడియాతో నిసిగ్గుగా మాట్లాడొచ్చా..? – ఇంకో మంత్రి అచ్చెన్నాయుడు ఎస్సీ ఉద్యోగి, ఆర్‌అండ్‌బీలో పనిచేస్తున్న మహిళను కాలుతో తన్నాడు.. ఆమె లబోదిబోమంటూ మొత్తుకుంది. పాదయాత్రకు వచ్చి అన్నా.. ఎస్సీ ఉద్యోగిని కాలుతో తన్నినా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదనను నాతో చెప్పుకుంది. – ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని మాట్లాడారు. ముఖ్యమంత్రే ఇలా మాట్లాడితే.. మంత్రులు, అధికారులు మాట్లాడరా.. వీరివల్ల ఎస్సీలకు మంచిరోజులు ఉంటాయా..?– ఎక్కడైనా అసైన్డ్ భూములు కనిపిస్తే చాలు ఎవరైనా పేదవాడికి ఇవ్వాలనుకుంటారు. నాన్నగారు ప్రియతమనేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో అక్షరాల 5 సంవత్సరాల 3 నెలల కాలంలో 32 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేశారు. 22 లక్షల మందికి పట్టాలు అందజేశారు. – ఇవాళ చంద్రబాబు పాలనలో ఎక్కడైనా అసైన్డ్ భూములు కనిపిస్తున్నాయా..? అసైన్డ్ భూములు వారి అత్తగారి సొత్తుగా లాక్కుంటున్నారు. ఎంత తక్కువ ధరకు లాక్కోవాలాని దిక్కుమాలిన ఆలోచనలు ప్రభుత్వంలో జరుగుతున్నాయి. – కరువు పనుల పరిస్థితి ఎలా ఉంది. నాన్నగారి హయాంలో ఉపాధి హామీ పనులను కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పేదవారి కోసం ఖర్చు చేశారు. – ఇవాళ చంద్రబాబు ఆ నిధులను అత్తగారి సొత్తుగా భావిస్తూ రాష్ట్రంలో ఏ అవసరాలకైనా వీటినే ఉపయోగించుకుంటారు. కార్యకర్తలు మేయడానికి కూడా వీటిని ఉపయోగించుకుంటున్నారు. – నీరు– చెట్టు కార్యక్రమం అంటాడు. నీరు చెట్టు అంటే నిండుగా భోజనం చేయండి అని కార్యకర్తలకు ఉపాధి హామీ నిధులు కేటాయిస్తున్నారు. – సిమెంట్ రోడ్డులకు ఉపాధి హామీ నిధులు తీసుకోవడం ఎంత వరకు ధర్మం. దళిత మహిళలను వివస్త్రను చేసి కొడితే ఏం చర్య తీసుకున్నారు..– పెందుర్తి జెర్రిపోతులపాలెంలో దళిత మహిళలను వివస్త్రను చేసి కొడితే ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు. దాన్ని సోషల్ మీడియాలో వీల్లే వీడియో తీసి పెడితే చేసిన వారిపై ఏం యాక్షన్ తీసుకున్నారు. – వారంతా తెలుగుదేశం వారే కాబట్టే యాక్షన్ తీసుకోలేదు. గరగప్రరు, దేవరపల్లి, అగిరిపల్లి, అమలాపురం, అనంతపురం, కర్నూలు, గుంటూరు, పత్తిపాడు, రాజధాని ప్రాంతంలో ప్రతి చోట దళితులపై దాడులు జరుగుతున్నాయి. – చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత దళితుల భూములను లాక్కుంటూ రికార్డులు మార్చుతూ వారికి అనుకూలంగా ఉన్నవారి పేర్లను ఎక్కిస్తున్నారు. – చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూశారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం ఏం చేయబోతున్నాం అనే అంశాలను కూడా చెబుతాను. వాటిపై సూచనలు, సలహాలు ఇవ్వండి. కచ్చితంగా నాలుగు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను నేను చదివిస్తా...– నవరత్నాలను ప్రకటించాం. ప్రతి పేదవాడి కోసం వాటిని ప్రకటించాం. ఇవాళ మన పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్లు చదివే పరిస్థితిలో ఉన్నారా.. ఆలోచన చేయండి. – ఇంజినీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తూ లక్షల రూపాయలు ఉన్నాయి. చంద్రబాబు ఇచ్చేది రూ. 30 వేలు మాత్రమే. మిగిలిన డబ్బులు కట్టలేక ఉన్న ఆస్తులను ఆ తల్లిదండ్రులు అమ్ముకుంటున్నారు. – ప్రియతమనేత వైయస్ రాజశేఖరరెడ్డి నాన్నగారి పాలనలో ఏ పేదవాడు చదువుకోవాలనుకున్నా.. చదువుకు డబ్బు అవసరం కాకూడదని, ఏం చదువుతారో చదవండి నేను దగ్గరుండి చదివిస్తానని చెప్పి భరోసా ఇచ్చారు. – ఆయన మరణం తరువాత కథ మొదటికొచ్చింది. చంద్రబాబు పాలనలో ఫీజులు లక్షల్లో ఉన్నాయి. బాబు ఇచ్చేది ముష్టివేసినట్లుగా రూ. 30 వేలు అది కూడా సమయానికి ఇవ్వడు. – ఈ పరిస్థితి చూసి నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తాడు.– ఎన్ని లక్షలు అయినా పర్వాలేదు. మీ పిల్లలను చదివిస్తా. అంతేకాకుండా హాస్టల్ ఖర్చుల కోసం ఏడాదికి రూ. 20 వేలు వేస్తాం. ఏ తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పులపాలు కాకూడదు. – మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలన్నా పునాధులు పాఠశాల స్థాయి నుంచే పడతాయి. చిట్టి పిల్లలంతా డాక్టర్లు, ఇంజినీర్లు అయితేనే మన తలరాతులు, బతుకులు మారుతాయి. – నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్పా.. పిల్లలను బడులకు పంపిస్తే సంవత్సరానికి రూ. 15 వేలు ఆ తల్లిదండ్రులకు ఇస్తా. పిల్లలను బడికి పంపిస్తే మన తలరాతలు మారుతాయి. ఇది నవరత్నాల్లో మనం చేయబోయే కార్యక్రమం. రెండో కార్యక్రమం.. – అవ్వా తాతల కోసం చేపట్టాం. చంద్రబాబుకు పెన్షన్ పెంచేందుకు మనసు రాదు. కాంట్రాక్టర్‌లకు మాత్రం విచ్చల విడిగా పెంచుతాడు. – వాస్తవంగా పెట్రోల్, డీజిల్ ధర తగ్గింది. స్టీల్, సిమెంట్, అల్యుమినియం తగ్గింది అయినా కాంట్రాక్టులకు రేట్లు పెంచుతున్నారు. కారణం లంచాలు ఎక్కువ వస్తాయని పెంచుతున్నారు. అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌లు మాత్రం పెరగవు. కారణం బాబుకు కమీషన్ రాదు కాబట్టి. – మన ప్రభుత్వం వచ్చాక ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పెన్షన్ రూ. 2 వేలు చేయబోతున్నాం. అంతే కాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పనులకు పోతే తప్ప కడుపునిండని పరిస్థితి. వారం రోజుల పాటు పనులకు పోకపోతే పస్తులు పండుకోవాలి. మన ప్రభుత్వం వచ్చాక పస్తులుండాల్సిన అవసరం లేదు. పెన్షన్ రూ. 2 వేలు ఇవ్వడం కాదు. పెన్షన్ వయస్సు 45కు తగ్గిస్తాం. ప్రతి పేదవాడికి భూములు, ఇల్లు....– నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశాం. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇల్లు కట్టిస్తానన్నాడు. ఒకరికైనా ఇల్లు కట్టించాడా..?మీ అందరికీ హామీ ఇస్తున్నా.. నాన్నగారి పాలన గుర్తు చేసుకోండి నాన్నగారి హయాంలో దేశం మొత్తంలో 47 లక్షల ఇళ్లు కడితే దేశంతో పోటీపడి 48 లక్షల ఇళ్లు కట్టించాడు. ఆయన నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా, ఆ ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తా. – దేవుడి దయ, మీ అందరి దీవెనలతో అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా.