స్వార్థానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబు

హైదరాబాద్‌:

చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతల భేటీ అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైఫల్యం వల్లే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణం అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు. 

Back to Top