నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచాడు


చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోవద్దు
టీడీపీ పతనం తూర్పుగోదావరి నుంచే మొదలు కావాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి

కాకినాడ: తప్పుడు మాటలు నమ్మి ప్రజలంతా  చంద్రబాబుకు అధికారం కట్టబెడితే ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా పాలన చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు కుప్పిగంతులు చూస్తున్నారని, తాట తీయడానికి మొట్ట మొదటి అడుగు తూర్పుగోదావరి నుంచే పడుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు పెట్రోలింగ్‌ యూనివర్సిటీ, పరిశ్రమలు, తెలుగు విశ్వవిద్యాలయం అని అనేక హామీలిచ్చి మోసం చేశారన్నారు.రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడం కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ కష్టపడుతున్నారన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చే సీట్లతోనే పార్టీ అధికారంలోకి వస్తుందని, జిల్లా రైతులంతా వైయస్‌ఆర్‌ సీపీకి భరోసా ఇవ్వాలని కోరారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు సుజనా చౌదరి దేశం తలదించుకునేలా బ్యాంకులను దివాళా తీయించిన వ్యక్తిని బర్తరఫ్‌ చేసే దమ్ము నీకుందా చంద్రబాబూ అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ జెండా రంగు ఏంటో తెలియదని, ఎప్పుడు ఏ పార్టీతో జతకడతాడో.. ఏ రంగు కండువాలు వేసుకుంటాడో ఆయనకే తెలియదన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం ఆంధ్రరాష్ట్రం నుంచి డబ్బులు పంపిస్తున్నాడన్నారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు డబ్బు లేదు కానీ.. దుబారా ఖర్చు చేయడానికి మాత్రం కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. రాబోయే కాలంలో చంద్రబాబుకు బుద్ధి చెప్పే కార్యక్రమం తూర్పు గోదావరి నుంచే మొదలు కావాలన్నారు. 
Back to Top