అయిజలో ఆదివారం షర్మిల బహిరంగ సభ

మహబూబ్‌నగర్‌, 24 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 39వ రోజు ఆదివారం నాటి షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్‌ ఎడ్మ కిష్టారెడ్డి ప్రకటించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వెంకటాపురం స్టేజీ నుంచి షర్మిల 39వ ఆదివారంనాటి పాదయాత్రను ప్రారంభిస్తారు. తరువాత పర్దీపురం,  ఉప్పల్‌ క్రాస్ రోడ్ మీదుగా కొనసాగిస్తారు. అక్కడ మధ్యాహ్నం విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర కొనసాగించి అయిజలో ఏర్పాటు చేసిన హిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 5.1కిలోమీటర్ల నడిచిన తరువాత రాత్రికి ఆమె బసచేస్తారు. ఆదివారంనాడు షర్మిల మొత్తం 15 కిలోమీటర్లు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తారని తలశిల రఘురాం, కిష్టారెడ్డి వివరించారు.
Back to Top