ఆటో డ్రైవ‌ర్ల భారీ ర్యాలీనెల్లూరు:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన హామీపై ఆటోడ్రైవ‌ర్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నెల 14న ఏలూరులో బహిరంగ సభ సాక్షిగా వైయ‌స్‌ జగన్‌ ...ఆటో డ్రైవర్లుకు హామీ ఇచ్చిన విషయం విదితమే. వైయ‌స్ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే ఆటో కొనుగోలు చేసేవారికి పదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తుందని ఆయన ప్రకటన చేశారు. ఈ మేర‌కు నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో నెల్లూరు న‌గ‌రంలో గురువారం భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆటో డ్రైవ‌ర్ల యూనిఫాం ధ‌రించి ఎమ్మెల్యే అనిల్ ఆటో న‌డుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఆటో డ్రైవ‌ర్లు మాట్లాడుతూ..మా గురించి ఆలోచ‌న చేసిన ఏకైక నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ అని పేర్కొన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న‌న్న‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుంటామ‌ని వారు నిన‌దించారు.  
Back to Top