దళితులపై దాడి అమానుషం

()చర్మవృత్తికారులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
()గాయపడిన ప్రతీఒక్కరికీ రూ.8 లక్షల 25 వేలు ఇవ్వాలి
()హోంమంత్రి సొంత ఇలాఖాలో ఇలా జరగడం దారుణం
()ఇలా చేయడం ధర్మమేనా చంద్రబాబు
()వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్

తూర్పుగోదావరి(అమలాపురం): దళితులపై దాడి అమానుషమని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు.  పోలీసుల సమక్షంలోనే దుండగులు దళితులను అన్యాయంగా నడిరోడ్డున కట్టేసి చెప్పులతో కొట్టడం అత్యంత హేయనీయమన్నారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబు... దళితులపై ఇంత దారుణంగా దాడి జరిగినా కనీసం బాధితుల దగ్గరకు వెళ్లి భరోసా ఇచ్చే కార్యక్రమం చేయకపోవడం బాధాకరమన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఇటీవల దళితులపై దుండగులు దాడి చేసిన ఘటనలో గాయపడిన వారిని... ఏరియా ఆస్పత్రికి వెళ్లి వైయస్ జగన్  పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసాయిచ్చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఏమన్నారంటే..

వైయస్ జగన్ మాటల్లోనే...
()చర్మవృత్తికారులపై జరిగిన దాడి అత్యంత హేయనీయం. వ్యవస్థలో ఇంత దారుణం జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా.
()ఆస్పత్రికి వెళ్లి ఏం జరిగిందన్నా అని అడిగితే వాళ్లు చెప్పిన మాటలు విని బాధేసింది.
()అరవింద్ అనే ఆయన ఆవు చనిపోతే అది తీసుకెళ్లమని చర్మాన్ని వలుచుకునే వృత్తిగలవారైన వెంకటేశ్వరరావు మరో ముగ్గురికి చెప్పాడు.
అప్పుడు వారు ఆవును తీసుకెళ్లి శ్మశానంలో చర్మాన్ని వలిచి పూడ్చిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అది వాళ్ల వృత్తి. వారికి వేరా ఆదాయ మార్గాలు లేవు. దశాబ్దాలుగా చేస్తున్న వృత్తి. 
()కొందరు ఆగంతకులు శ్మశానం వద్దకు వచ్చి బండి నంబర్ నోట్ చేసుకున్నారు. 10,15 నిమిషాలకు 15 మందికి పైగా వచ్చి ఆ నలుగురు దళితులను శ్మశానం నుంచి బయటకు లాక్కొని వచ్చి నడిరోడ్డుమీద చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. దుర్భషలాడుతూ చెప్పులతో మొహంపై కొట్టారు. కొట్టబడిన వాళ్లల్లో ఓ టెన్త్ పిల్లాడున్నాడు. ఆ పిల్లాడిని కూడా కొట్టారు. 
()మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. తప్పు ఎవరు చేసినా తప్పే. ఒకవేళ వాళ్లు చేస్తున్నది తప్పైతే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టాలి.  కానీ ఈ మాదిరిగా వీళ్లంతకు వీళ్లే మనుషులను తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి నడిరోడ్డుమీద కొట్టడమన్నది సమాజం ఖండించదగ్గ విషయం.
() పోలీసుల సమక్షంలో ఆ దుండగులు ఇంకా వాళ్లను ఎక్కువగా కొట్టారు. వీళ్లను కాపాడేందుకు వచ్చిన పిల్లలను కూడా నడిరోడ్డుమీద మోకాళ్ల మీద కూర్చోబెట్టి వాళ్లముందు మళ్లీ కొట్టారు. అర్థగంట తర్వాత పోలీసులు వీళ్లను తీసుకెళ్లారు. కనీసం వారు చెప్పే మాట కూడ వినలేదు. ఓనర్ తో మాట్లాడమని చెప్పినా వినాలన్న ఆలోచన కొట్టినవాళ్లుగానీ, పోలీసులు గానీ చేయలేదు. 
() హోంమంత్రి  సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన  జరగడం బాధాకరం.
()మరుసటి రోజు తర్వాత అరవింద్ దగ్గరకి పోవాలని దళితసంఘాలు గొడవలు చేస్తే... అప్పుడు వీళ్లు చెప్పేది నిజమని తెలిసి వదిలేశారు. పోలీసులు కూడా వ్యాన్ డ్రైవర్ ను కొట్టారు. చట్టాలను అవమానిస్తూ పేదవాడి పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తే ఈవ్యవస్థ ఏం బాగుపడుతుంది.
()చంద్రబాబు ఈ జిల్లాకు వచ్చి కూడా బాధితుల దగ్గరకు వెళ్లకపోవడం బాధాకరం.  హాస్పిటల్ లో బాధితులను పరామర్శించి ఉంటే నిందితులను శిక్షిస్తారన్న మనోధైర్యం వీళ్లల్లో వచ్చేది. మనిషిని మనిషిగా చూడాలంటే వ్యవస్థలో మార్పు రావాలి
()అట్రాసిటీ చట్టం ప్రకారం ఇలాంటి ఘటన జరిగితే ప్రభుత్వం తరపు నుంచి బాధితులకు రూ.లక్ష నుంచి 8 లక్షల 25 వేలకు ఇవ్వాలని చట్టం చెబుతుంది.కానీ,  లక్ష మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇలా చేయడం ధర్మమేనా బాబు. మన వ్యవస్థలో మార్పులు రావాలంటే ముందుండి గట్టిగా నిలబడి అడగాలి. 
()దళితులపై దాడి జరిగిందని జగన్ వచ్చాడన్నది కరెక్ట్ కాదు. పాల్మన్ పేటలో మంత్రి యనమల రామకృష్ణడు తన మనుషులను పంపించి 
పాల్మన్ పేటలో బీభత్సం సృష్టించాడు. అప్పుడు కూడా మత్స్యకారులకు అండగా నిలబడ్డా. ఇప్పుడు దళితులకు జరుగుతున్న అన్యాయంపై  ఇక్కడకు వచ్చా. 
()దోషుల్ని కఠినంగా శిక్షించాలి. అలా అయితేనే వ్యవస్థ బాగుపడుతుంది.  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం గాయపడిన  ప్రతీ ఒక్కరికి రూ.8 లక్షల 25 వేలు ఇవ్వాలి. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా బాబు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ప్రజలకు తోడుగా ఉందన్న భరోసా ఇవ్వాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు. 
Back to Top