అతిరాస కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌


అతిరాస కులస్తులతో వైయస్‌ జగన్‌ ఆత్మీయ సమ్మేళనం
పశ్చిమ గోదావరి: అతిరాస కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ  ఇచ్చారు. ఎక్కడైతే చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేని కులాలను ఎమ్మెల్సీలుగా గుర్తించి చట్ట సభల్లోకి తీసుకొస్తామన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ అతిరాస కులస్తులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిరాస కులస్తులు మాట్లాడుతూ..తమను దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బీసీల్లో చేర్చారన్నారు. వైయస్‌ఆర్‌ చేసిన మేలు ఎప్పటికీ మరువలేమని అతిరాస కులస్తులు  పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరుతాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
Back to Top