భాదిత కుటుంబానికి చేయూత

రెంటచింతల (మంగ‌ళ‌గిరి): మండల కేంద్రమైన రెంటచింతలలో ఈ నెల 16న విద్యుత్‌ ఘాతానికి గురై మరణించిన షేక్‌ మస్తాన్‌వలి కుటుంబానికి నర్సరావుపేట వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ  ఎంపీ ఇన్‌చార్జి అయోధ్య‌రామిరెడ్డి చేయూత  అందించిన‌ట్లు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు,  మాజీ సర్పంచ్‌ అల్లం మర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మస్తాన్‌వలి కుటుంబానికి ఆయన పార్టీ నాయకులతో కలిసి 3టిక్కీల బియ్యాన్ని అందజేసి మాట్లాడారు. పేదలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌న్నారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన కార్యావర్గ సభ్యులు మోర్తల ఉమ,మండల పార్టీ ఉపాద్యక్షుడు ఏరువ శౌరెడ్డి,పార్టీ జిల్లా కార్యదర్శి అల్లం ప్రతాప్‌రెడ్డి,జిల్లా రైతు విభాగం ఉపాద్యక్షుడు గుజ్జుల సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top