సింగపూర్ కంపెనీలేమైనా మదర్ థెరిస్సా ట్రస్టులా..?

హైదరాబాద్ః స్విస్ ఛాలెంజ్ లో పారదర్శకత లోపించిందని కేల్కర్ కమిటీ చెప్పినా వినకుండా.... ప్రభుత్వం ఆ విధానాన్ని అవలభించడం దారుణమని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎంతసేపు ప్రజలను దోచుకుందామన్న ఆలోచనే తప్ప అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధే ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.  ప్ర‌భుత్వం ఏదైనా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ప్పుడు ఓపెన్ టెండ‌ర్ పిలుస్తుందని, అవేమీ లేకుండానే బాబు ఇష్టానుసారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  అభిమానంతో సింగపూర్ కంపెనీలు మందుకు వచ్చాయని బాబు చెప్పడం హాస్యాస్ప‌దమ‌న్నారు. సింగపూర్ కంపెనీలు ఏమైనా మ‌దర్‌ థెరిస్సా ట్ర‌స్టులా అని బాబును ప్ర‌శ్నించారు. 

Back to Top