జిల్లా రాజకీయాలకు అప్పయ్యదొర దిక్సూచి

నందిగాం: శ్రీకాకుళం జిల్లా రాజకీయాలకు అప్పయ్య దొర దిక్సూచి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేరాడ తిలక్‌ అన్నారు. రాజకీయాలలో అవినీతి మచ్చలేని, విలువలు కల్గిన వ్యక్తి హనుమంతు అప్పయ్యదొర అని ఆయన కొనియాడారు. శ్రీకాకుళం మాజీ ఎంపీ, టెక్కలి మాజీ శాసనసభ్యులు హనుమంతు అప్పయ్యదొర 83వ జయంతి సందర్బంగా   బు«ధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న అప్పయ్యదొర విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా రాజకీయాలకు అప్పయ్యదొర ఒక దిక్సూచి అని ఆయన అడుగుజాడలలో నేతలంతా నడవాలని కోరారు. అలాగే అతని రాజకీయ జీవితంలో ఏనాడు రాజీ పడలేదని, ప్రజల కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు.  స్థానిక జడ్పీటీసీ కురమాన బాలక్రిష్ణారావు మాట్లాడుతూ నీతి నిజాయితీలకు మారు పేరు దొర అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిదియ్రర చక్రవర్తి, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి పొందల విశ్వేశ్వరరావు,  జిల్లా ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి జడ్యాడ జయరాం,  ఎంపీటీసీలు నడుపూరు శ్రీరాంమూర్తి, నాగా రామారావు, పుష్యా సత్యం,నాయకులు కణితి నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Back to Top