రైతన్న ఉసురు తీస్తున్న పచ్చసర్కార్

గుత్తి:
చంద్రబాబు తన మోసపూరిత హామీలు, నిర్లక్ష్యంతో అన్నం పెట్టే అన్నదాత ఉసురు
తీస్తున్నాడు. రైతన్నను అడుగడుగునా దగా చేస్తున్నాడు. ఎన్నికల ముందు ఇచ్చిన
 ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా రైతన్నల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. రుణాలు మాఫీ కావడం లేదు. ఆరుగాలం శ్రమించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం
లేదు. ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపులు లేవు. ధాన్యం కొనుగోలు చేసే నాథుడే
కరవయ్యాడు. దీంతో రైతులకు ఆత్మహత్యలే శరణమయ్యాయి. 

అప్పుల
బాధ తాళలేక అనంతపురం జిల్లా గుత్తిమండలం ఉబిచర్ల గ్రామంలో ఓ కౌలు రైతు
ఆత్మహత్మ చేసుకున్నాడు.  గ్రామానికి చెందిన రాముడు(44) రుణాలు అందక ....పంట
కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో  పురుగుల మందు తాగి ప్రాణాలు
తీసుకున్నాడు.  రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న ఆత్మహత్యలపై కోర్టులు
చివాట్లు పెట్టినా పచ్చసర్కార్ కు పట్టడం లేదు. రైతులు పిట్టల్లా
రాలుతున్నా అవేమీ పట్టనట్లు ప్రభుత్వం చోద్యం చూస్తుండడం బాధాకరం.

తాజా వీడియోలు

Back to Top