ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

అసెంబ్లీః టీడీపీ నేతల కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మహిళల మాన, ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాల్ మనీ కేసుపై చర్చించాల్సిందేనంటూ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ పట్టుబట్టుంది. చర్చకు పట్టుబడుతూ  కాల్ మనీ సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్స్ రాకెట్ లో టీడీపీ నేతలున్నందున..చంద్రబాబు కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని నేతలు విమర్శించారు. 

ప్రజాసమస్యలపై చర్చకు డిమాండ్ చేసినందుకు ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులు శివప్రసాద్ రెడ్డి, దాడిశెట్టి రాజాలపై  సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో ఆందోళన చేపట్టడంతో  స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. ప్రతిపక్షంపై ఎదురుదాడే లక్ష్యంగా చంద్రబాబు ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలను ఉసిగొల్పారు. టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రతిపక్ష సభ్యులను సైకో, నియంత అంటూ దుర్భషలాడారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top