<br/>హైదరాబాద్) వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లలోనూ చంద్రబాబు ప్రభుత్వం మోసాలు చేస్తోందని ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మండిపడ్డారు. గతంలో రూ. 70 ఇచ్చే పింఛన్లను దివంగత మహానేత వైఎస్సార్ రూ. 200 ఇప్పించారని గుర్తు చేశారు. అయితే ఇది పేదలకు సరిపోవటం లేదని గుర్తించి తాము రూ. 700 ఇస్తామని ప్రతిపాదించామని చెప్పారు. వెంటనే కంగారు పడిన తెలుగుదేశం పార్టీ రూ. వెయ్యి చొప్పున ఇస్తామని ప్రతిపాదించిందని తెలిపారు. కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పూర్తిగా పింఛన్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రూ. 43 లక్షలకు పైగా పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా, ఏ నెలలోనూ రూ. 39 లక్షలకు మించి ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనసభ నుంచి తాము వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు.