అంగన్ వాడీల ఆందోళన.. అరెస్ట్

విజయవాడ: తమ న్యాయపరమైన
డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం దౌర్జన్యకాండ
ప్రదర్శిస్తోంది. విజయవాడలో అంగన్ వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన
ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నించిన అంగన్
వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. మహిళలను దారుణంగా ఈడ్చుకెళ్లి వ్యాన్ లలో
కుక్కి అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర
వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం, పోలీసుల దుశ్చర్యపై అంగన్ వాడీ లు
మండిపడుతున్నారు. 
Back to Top