రేవంత్ ను బాబే కాంగ్రెస్ లోకి పంపారేమో..?

  • సొంత సోకుల కోసం ప్రభుత్వ ధనం దుబారా చేస్తున్న బాబు
  • ఓటుకు నోటు కేసు భయంతో టీఆర్ఎస్ కు లొంగిపోయిన బాబు
  • టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళితే సంతలో పశువులు
  • రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లినా పల్లెత్తు మాట అనని చంద్రబాబు
  • రేవంత్ ను దూషిస్తే తన బండారం భయపడతుందని బాబు భయం
  • పాదయాత్రను అభాసుపాలు చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది
  • అశేషప్రజానీకం, వైయస్ఆర్ అభిమానులు గమనిస్తూ ముందుకు సాగాలి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్ః చంద్రబాబు తన సొంత సోకులకు, విలాసాలకు ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి
అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రమాణ స్వీకారం చేశాక పదికోట్లతో కొత్త వాహనాలు కొన్న బాబు..మళ్లీ ఇప్పుడు కాన్వాయ్ పెంచేదానికి మరో రూ. 5 కోట్ల 65 లక్షలు రిలీజ్ చేస్తూ జీవో జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.  ఇన్ని కోట్లు వెచ్చించి వాహనాలు కొనాల్సిన ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ బాబు దుబారాగా ఖర్చు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. చంద్రబాబు దుబారా ఖర్చులపై అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రూ.కోట్లాది వెచ్చించి ఆర్టీసీబస్సు,  ప్రత్యేకవిమానాల్లో విదేశీ ప్రయాణాలు, హైదరాబాద్ లో నివాసముంటూ సీఎం కార్యాలయం ఎల్ బ్లాక్ కు 14కోట్లు ఖర్చు, ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ బాబు నీతి వాఖ్యాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు.  5కోట్ల 60 లక్షలు రిలీజ్ చేసి వాహనాలు కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత భారంగా కనిపిస్తుందన్న విషయాన్ని బాబు గమనించాలన్నారు. ప్రభుత్వ సొమ్మును ఇంత దారాళంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో ఒక్కసారి బాబు ఆలోచించుకోవాలన్నారు. హయత్ పార్కులో కుటుంబమంతా లగ్జరీ గా ఉండి కోట్లరూపాయల్ని చెల్లించారు. ఆ బిల్లును బహిర్గతం చేయకుండా రహస్య జీవోలు విడుదల చేసి ఖర్చు పెట్టారు. బాబు తన విలాసాల కోసం వందల కోట్లు ప్రభుత్వ ధనాన్ని దుబారా చేయడం సరికాదని అంబటి హితబోధ చేశారు.  

టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లినప్పుడు సంతలో పశువుల్లా శాసనసభ్యులను కొంటున్నారని మాట్లాడిన బాబు... రేవంత్ కాంగ్రెస్ లోకి వెళితే ఎందుకు మాట్లాడడం లేదని అంబటి ప్రశ్నించారు.  చంద్రబాబు నాయుడే రేవంత్ ను కాంగ్రెస్ లోకి పంపిచే కార్యక్రమం చేస్తున్నారన్న భావన కలుగుతోందన్నారు. రాష్ట్ర విభజన చేసి ఏపీని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందన్న చంద్రబాబు....అలాంటి పార్టీలోకి రేవంత్ వెళుతుంటే ఏం మాట్లాడకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత బాబు తన స్ట్రాటజీ మార్చాడని,  టీఆర్ఎస్ ను విమర్శించే పరిస్థితులో బాబు లేడని అంబటి ఎద్దేవా చేశారు. ఆఖరికి కృష్ణా, గోదావరి నదుల మీద అనుమతులు లేకుండా టీఆర్ఎస్ ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా బాబు లొంగిపోయాడని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఇద్దరు ముద్దాయిలు కాబట్టే, రేవంత్ నోరు విప్పితే తన  బండారం బయటపడుతుందని బాబు భయపడుతున్నాడని అంబటి అన్నారు. బాబు ఏ రాజకీయ పార్టీతోనైనా సరే కుమ్మక్కవుతనడానికి ఆయన దుష్ట బుద్ధికి, మేనేజ్ మెంట్ కి ఇది ప్రధాన ఉదాహరణగా అంబటి చెప్పారు. చంద్రబాబు విధానాలను ఉభయ రాష్ట్రాల ప్రజలు గమనించాలని అంబటి అన్నారు. 

ఈనెల 6 నుంచి వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించబోతున్నారని, వైయస్సార్సీపీ దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని 
అంబటి అన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభిస్తుంటే.. కుట్రలు, కుతంత్రాలు చేసి ప్రజాసంకల్పయాత్రను భగ్నం చేయాలని బాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. తుని ఘటన టీడీపీ చేసిన కుట్ర అని అంబటి ధ్వజమెత్తారు. ఇంతవరకు దానికి కారకులైన వారిని అరెస్ట్ చేయని దౌర్భాగ్య పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. జగన్ పాదయాత్రను అభాసుపాలు చేయాలని టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి...వైయస్ఆర్ అభిమానులు, ప్రజాసంకల్పయాత్రకు మద్దతు పలుకుతున్న అశేష ప్రజానీకం ఎప్పటికప్పుడు గమనించేలా ముందుకు సాగాలని అంబటి కోరారు. 

తాజా వీడియోలు

Back to Top