చంద్రబాబు గురివింద గింజ లాంటివాడు..ఏపీ ప్రయోజనాలే వైయస్‌ఆర్‌సీపీ ధ్యేయం..లక్ష్యం..వైయస్‌ఆర్‌సీపీకి ఎవరి తోడు అవసరం లేదు..వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ<br/><strong>విశాఖపట్నంః </strong>ఏపీలోని వ్యవస్థలను భ్రష్టపట్టించి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో పొత్తు దేశ రక్షణ కోసమా...దేశం పార్టీ రక్షణ కోçసమా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీలో అవినీతిపరుల్ని రక్షించుకోవడానికి కలయిక అని మండిపడ్డారు. వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయని, ఐటి దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..ఈ నాలుగున్నరేళ్ల లో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమిటీ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసి దేశంలో వ్యవస్థలు గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.గతంలో సిబిఐ అంటే కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ అని చెప్పిన చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ ప్రజలు ఆలోచించాలన్నారు. బీజేపీ దేశంలో ఏవిధంగా వ్యవస్థలను నాశనం చేస్తుందో అంతకంటే ఎక్కువగా రాష్ట్రంలోని వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక చిన్న దొంగను వదిలి..పెద్ద దొంగను..పెద్ద దొంగను వదిలి గజదొంగను వదిలినట్లు చంద్రబాబు చేష్టలు ఉన్నాయన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ది ఒక్కటే ధ్యేయం.ఒక్కటే ఆలోచన అని ఏపీ ప్రయోజనాలు కోసం, ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం కోసం పుట్టిన పార్టీ అని తెలిపారు. దివంగత మహానేత వైయస్ రాజ్‌శేఖర్ రెడ్డి ఆశయాల నుంచి పుట్టిన పార్టీ అని ఆయన ఆలోచలను నిరంతరం కాపాడే పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో కష్టనష్టాలను తట్టుకుని నిలబెట్టిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని తెలిపారు. గత నాలుగేళ్లుగా మిత్ర పక్ష పార్టీలుగా బీజేపీ,టీడీపీలు ఏపీని నష్టపరిచే చర్యలకు పాల్పడితే వాటిపై వైయస్‌ఆర్‌సీపీ పోరాటాలు చేసిందన్నారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేసిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అన్నారు. ప్రత్యేక హోదా కోస రాజీనామాలు చేసిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అన్నారు. నేడు చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చుకుని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, రాష్ట్రంలోకి అడుగుపెట్టనియమని చెప్పిన చంద్రబాబు ఏ ముఖంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ఆదరణ, జాతీయ మీడియా సర్వేలు, వ్యక్తిగత సర్వేల రిపోర్టులకు భయపడి పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. ఒంటరిగా గెలవలేమనే భయంతో గతంలో బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు.. నేడు కాంగ్రెస్‌తో జతకట్టారని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌సీపీకి ఎవరు తోడు అవసరం లేదన్నారు.ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఒక ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే కనీసం ఖండించలేని వ్యక్తిత్వం చంద్రబాబు అని మండిపడ్డారు. వైయస్ జగన్‌పై చంద్రబాబు,లోకేష్,పోలీసులు కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు..థర్డ్ పార్టీ విచారణ అంటే ఎందుకంత భయం అని ప్రశ్నించారు. టీడీపీ నేత పరిటాల రవిపై హత్య జరిగినప్పుడు సిబిఐ విచారణ చేయించాలని టీడీపీ కోరిందని వెంటనే సిబిఐచే అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విచారణ చేయించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎందుకు ఎంక్వైరి వేయలేకపోతున్నారని, పోలీసులు కాల్ డేటా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.