మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన

గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ చేపట్టిన  బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్రబంద్ పిలుపు నేపథ్యంలో తెలవారుజామున ఉదయం 5 గంటల నుంచే ఆళ్లరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మంగళగిరిలో బంద్ నిర్వహించాయి.

బస్టాండ్ ఆవరణలో ధర్నా చేపట్టి బస్సులను బయటకు వెళ్లనీయకుండా  అడ్డుకున్నారు. దీంతో, ఎమ్మెల్యేతో పాటు 30 మంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

తాజా ఫోటోలు

Back to Top