ఐదు నియోజకవర్గాలు.. 190 కిలోమీటర్లు


అనంతపురంలో షర్మిల యాత్ర
పులివెందుల: అనంతపురం జిల్లాలో ఈ నెల 23 మధ్యాహ్నం షర్మిల పాదయాత్ర మొదలవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, గురునాథరరెడ్డి తెలిపారు. ధర్మవరం, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, గుంతకల్లు నియోజకవర్గాలలో 15రోజుల పాటు 190 కిలోమీటర్లు ఆమె నడుస్తారని వారు వివరించారు.  చంద్రబాబు పాదయాత్ర నీరస యాత్రలా, ప్రజా ఛీత్కార యాత్రలా మారిందన్నారు. గత మూడేళ్ళలో అవినీతి పెరిగిందని బొత్స అంగీకరిస్తున్నారా అని వారు ప్రశ్నించారు. షర్మిల పాదయాత్ర కాంగ్రెస్, టీడీపీలకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ వంటిదన్నారు.   ఆమె వెంట లక్షల పాదాలు కదులుతున్నాయని వారు పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top