ఎమ్మెల్యేని క‌లిసిన అగ్రిగోల్డ్ బాధితులు

నెల్లూరుః కావ‌లి నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డిని అగ్రిగోల్డ్ బాధితులు క‌లిశారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాట్లాడినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వైయ‌స్ఆర్ సీపీ అగ్రిగోల్డ్ బాధితుల ప‌ట్ల అండ‌గా నిల‌బ‌డ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. బాధితుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఈ స‌మ‌స్య‌పై వైయ‌స్ జ‌గ‌న్ పోరాటం చేస్తార‌ని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

Back to Top