వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన వైఎస్సార్సీపీ

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి జరుగుతున్నాయి. సమావేశాల మొదటి రోజున నిబంధన 344 కింద వాయిదా తీర్మానం కోరుతూ వైఎస్సార్సీపీ నోటీసు ఇచ్చింది. అధిక వడ్డీలకు రుణాలు ఇవ్వటం, ఆ ముసుగులో మహిళల్ని లోబరచుకోవటం, అత్యాచారాలకు పాల్పడటం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశం మీద నోటీసును వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం తరపున నోటీసులు ఇవ్వటం జరిగింది.
మరో వైపు అసెంబ్లీలో కార్యకలాపాల్ని నిర్ధారించే బీఏసీ సమావేశం స్పీకర్ చాంబర్ లో ఏర్పాటైంది. అయిదు రోజులు కాకుండా అదనంగా సభను నిర్వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. 

తాజా వీడియోలు

Back to Top