అభివృద్ధికి ఆయ‌నే చిరునామా!

నేడు దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి.  తెలుగు
ప్ర‌జ‌ల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి శ్ర‌మించినంతగా
మ‌రెవ‌రూ శ్ర‌మించ‌లేదు.యావ‌ద్దేశం ఆశ్య‌ర్య‌పోయేలా వినూత్న ప‌థ‌కాల‌తో
తెలుగు ప్ర‌జ‌లు జీవించ‌డానికి ఒక ఆశావాహ వాతావ‌ర‌ణం క‌ల్పించారు.ఆయ‌న నేడు
ఒక వ్య‌క్తిగా మ‌న ముందులేరు. కానీ ఒక శ‌క్తిగా, ఆద‌ర్శంగా ప్ర‌జ‌ల మ‌నో
భావాల‌కు, అభివృద్ధికి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు చిరునామాగా, చిరంజీవిగా
ప్ర‌జ‌ల హృద‌యాల్లో వెలుగొందుతున్నారు.
                కాల‌మాన
ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయ‌డానికి ముందుకు వ‌చ్చే
నాయ‌కులు త‌మ‌ని తాము ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మర‌ల్చుకుంటారు. ఆ కోవ‌కు
చెందిన అరుదైన వ్య‌క్తి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ప్ర‌జ‌ల నుండి ప్ర‌జ‌ల
కొర‌కు ప‌ని చేసే నాయ‌క‌త్వం ఎలా ఉండాలంటే  మ‌న‌కు గుర్తుకు వచ్చేది వైఎస్
రాజ‌కీయ జీవితం. తాను ఏ ప్ర‌జ‌ల కోసం ప‌నిచేశాడో...........ఆ ప్ర‌జ‌లు
ఆయ‌న‌ను త‌ర‌చూ గుర్తుంచుకోవ‌డం, ఆయ‌న ఉంటే ఇప్పుడు ప‌రిస్థితులు ఇలా
ఉండేవి కావు అనుకోవ‌డం జ‌రుగుతుంది. విచిత్ర‌మేమిటంటే.........ఆయ‌న‌ను త‌ర‌చూ విమ‌ర్శిస్తూ..........విభేదించి
ఆయ‌న‌ను త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధిగా భావించిన వారు సైతం..........నేడు    
                            రాజ‌శేఖ‌ర్‌రెడ్డి బ‌తికిఉంటే తెలుగునాట
ప‌రిస్థితులు ఇలా ఉండేవి కాద‌ని అంగీక‌రించారు.       
         
       వైఎస్ నిరంతరం ప్ర‌జ‌ల‌ కోసం శ్ర‌మించారు, త‌పించారు. ఆయ‌న
పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించ‌ట‌మే కాకుండా, ఆరోగ్య‌శ్రీ లాంటి
విప్ల‌వాత్మ‌క‌మైన సంక్షేమ ప‌థ‌కానికి నాంది ప‌లికారు. అలాగే ఆకాశ‌మే
హ‌ద్దుగా ల‌క్ష‌లాది మంది పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణం కోసం నిర్మాణం కోసం
ఇందిర‌మ్మ ప‌థ‌కం అమ‌లు చేశారు.
               వైఎస్ త‌న
ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ఉచిత విద్యుత్‌, విద్యుత్ బ‌కాయిలు ర‌ద్దు త‌దిత‌ర
కార్య‌క్ర‌మాలు ప్ర‌క‌టించారు. ఆయ‌న అధికారం చేప‌ట్టాక ఆరోగ్య‌శ్రీ‌, ఫీజు
రీయింబ‌ర్స్‌మెంట్‌, మైనార్టీల సంక్షేమం, ఇందిర‌మ్మ ఇళ్లు, పావ‌లా వ‌డ్డీ,
రైతుల రుణ‌మాఫీ.... ఒక మాట‌లో  చెప్పాలంటే తెలుగు ప్ర‌జ‌ల‌కు జీవించ‌డానికి
ఒక ఆశావాహ వాతావ‌ర‌ణం క‌ల్పించారు.  చంద్ర‌బాబు తొమ్మిదేళ్ల పాల‌న‌లో
రైతుల ఆత్మహ‌త్య‌లు, వ‌ల‌స‌లు, అప్పులు, నిరుద్యోగ స‌మ‌స్య‌లు త‌దిత‌ర
విధానాల‌తో శ్మ‌శాన వాతావ‌ర‌ణం నుండి ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చారు.
దేశంలోకి పెద్ద ఎత్తున చొచ్చుకు వ‌చ్చిన ప్ర‌పంచ బ్యాంకు అనుకూల విధానాల
నుండి ఏర్ప‌డ్డ దుష్ప‌రిణామాల‌ను అర్థం చేసుకుని వాటిని ప్ర‌జ‌ల అభివృద్ధి
కోసం, రాష్ట్ర సంక్షేమ కోసం ఒక ప్ర‌త్యేక విధానం అమ‌లు ప‌రిచేశారు. అందుకే
ఆయ‌న తెలుగు జాతి అంత‌టికీ ఆరాధ్య దైవం.
Back to Top