బాబొచ్చాడు..జాబులు పోయాయి

అమరావతి: 

బాబొస్తే జాబొస్తుందని చెప్పిన సీఎం చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులకు షాకిచ్చారు. ఆయుష్‌ విభాగంలో పని చేస్తున్న 800 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్ల అవసరం లేదని, జీతాలు ఇవ్వలేమని, వారిని ఇంటికి పంపించండని ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా 2016 – 17లో పని చేసిన 12 నెలల కాలానికి వేతనం కూడా ఇవ్వకూడదని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. తాజా ఉత్తర్వులతో భవిష్యత్‌లో ఇంకా ఎంత మందిని సర్కారు తొలగిస్తుందోననే భయాందోళన మొదలైంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top