కుంటికాలిపై ఆరోగ్యశ్రీ..గాలిలో పేదవాడి ఆరోగ్యం

  • ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పేదవాడి ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు
  • ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా తండ్రిలాంటి ముఖ్యమంత్రిగా నాన్న ఉండేవారు
  • ఆరోగ్యశ్రీపై చంద్రబాబు దుర్మార్గాల్ని ప్రశ్నిస్తూ ధర్నాలు చేశాం
  • ఒంగులులో కలెక్టరేట్ ముట్టడిలో నేను పాలు పంచుకున్నా
  • ప్రభుత్వ నిర్లక్ష్యంతో వైద్యం చేయించుకోలేక 422మంది చనిపోయారు
  • జగన్ ప్రకాశం వస్తున్నాడని తెలియగానే బాబుకు భయం పట్టుకుంది
  • డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని జీవో విడుదల చేశారు
  • జగన్ వస్తే తప్ప పలకని పరిస్థితిలో బాబు ఆరోగ్యశ్రీని నడుపుతున్నాడు
  • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
  • పీసీపల్లెలో కిడ్నీ బాధితులతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి

ప్రకాశం: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకాన్నిపూర్తిగా నిర్వీర్యం చేసి పేదవాడి ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చంద్రబాబు సర్కార్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో పేదవాడు ఎలా బతుకుతున్నాడు అని చెప్పడానికి నిదర్శనం కిడ్నీ బాధితుల ఉదంతమే ఉదాహరణగా పేర్కొన్నారు.  నాన్నగారి పాలనలో ఏ పేదవాడికి ఆరోగ్యం లేకపోయినా నేనున్నానని చెప్పే తండ్రి లాంటి ముఖ్యమంత్రి ఉండేవారని వైయస్ జగన్ గుర్తు చేశారు. లక్షలు ఖర్చు అయినా నేనున్నానని చెప్పేవారు. ప్రియతమ నేత వైయస్ రాజశేఖరరెడ్డి  పాలనలో పేదవాడు అప్పులపాలు కాకుండా పెద్ద ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకొని చిరునవ్వుతో ఇంటికి తిరిగివచ్చే పరిస్థితి ఉండేదన్నారు. పీసీపల్లిలో కిడ్నీ బాధితులను కలుసుకున్న సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే..... కిడ్నీలు బాగలేకపోతే బతకలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని చెప్పడానికే ఇవాళ అందరం ఒక్క చోట ఏకమయ్యాం. పేదవాడికి సంఘీభావం తెలపడానికి వచ్చాం. వాళ్లు పడుతున్న బాధలేంటో..ప్రభుత్వం వాళ్లకు సహాయం చేయని కారణంగా వాళ్ల నోటి నుంచి వచ్చినప్పుడు కనీసం అప్పటికైనా చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం వస్తుందేమో ఆశిద్దాం. 

ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందంటే..ఆరోగ్యశ్రీ కోసం ప్రభుత్వానికి రూ.910 కోట్లు కావాలని కోరారు. బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ.568 కోట్లు కేటాయించారు. వీటిలో రూ.360 కోట్లు గత బకాయిలకే సరిపోతుంది.  దాదాపు రూ.1400 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే..కేవలం రూ.500 కోట్లు వెచ్చించారు. ఈ పథకంపై బాబు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రశ్నిస్తూ గత నెలలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాం. ఇదే జిల్లాలోని ఒంగోలు కలెక్టరేట్‌ ముట్టడిలో నేను కూడా పాలు పంచుకున్నాను. పేదవాడికి అండగా నిలిచేందుకు వైయస్‌ఆర్‌సీపీ ఆందోళనకు సిద్ధపడితే బాబు భయపడి మరో రూ.270 కోట్లు విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ ఇప్పటికీ కుంటికాలుతో నడుస్తోంది. దాన్ని అలాగే నడిపించాలన్నా ఇంకా డబ్బులు కావాలి. ఆరోగ్యశ్రీ బాగు పడాలి. మెరుగుపడాలని ఎన్నికలకు వెళ్లే ముందు మ్యానిఫెస్టోలో పెట్టాం. ఆరోగ్యశ్రీని పూర్తిగా మార్చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చాను. ఈ పథకంలో వైద్యం చేయించడమే కాదు, ఏ పేదవాడు అప్పులపాలు కాకుండా చూసేందుకు కాలు విరిగితే ఆరు వారాల పాటు పనిచేయలేని పరిస్థితి ఉంటుంది. కిడ్నీ బాధితులు అయితే ఎలాంటి పని చేయలేని దుస్థితి ఉంటుందని, అలాంటి కుటంబాలకు మందులు, ఉపాధికి సరిపడే డబ్బులు ఇస్తామని ఆ రోజు మ్యానిఫెస్టోలో పెట్టాను. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చొద్దు.  పేదవాడు బతికేందుకు డబ్బులు ఇచ్చి మెరుగు పరచండి. 

ఆరోగ్యశ్రీ దారుణంగా తయారైంది. కిడ్నీ బాధితులకు ముందుగా మాత్రలు అవసరం. నెలకు రూ.4500 ఖర్చు అవుతుంది. తీవ్రతను బట్టి డయాలసిస్‌ స్టేజ్‌కు వెళ్తుంది. వారానికి మూడు, నాలుగు సార్లు డయాలసిస్‌ చేయాల్సి వస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసేందుకు రూ. 3 వేలు అవుతుంది. ఇలా నెలకు రూ.16 వేల ఖర్చు అవుతుంది. డయాలసిస్‌ బాధితుల పరిస్థితి ఏంటో వాళ్లే చెబుతారు. అప్పటికైనా బాబుకు మానవత్వం వస్తుందేమో చూద్దాం. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బకాయిలు ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ పథకం పెట్టినప్పుడు 2007లో అప్పటి రేట్ల ప్రకారం ఇప్పుడు వైద్యం చేయడం సాధ్యం కాదని డాక్టర్లు అంటున్నారు. ఖర్చులు పెరిగిపోయాయని అంటున్నారు. క్యాన్సర్ ఆసుపత్రిల్లో కీమో థెరఫీ చేయాలంటే ఒక్కోసారి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక రోగికి 8 సార్లు కీమో థెరపీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఒక్కసారి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. మళ్లీ క్యానర్‌ తిరుగతోడుతోంది. మూగ చెవుడు పిల్లల్లో వ్యాధిని గుర్తించాలంటే ఏడేళ్లు అవుతుంది. దివంగత నేత వైయస్‌ఆర్‌ హయాంలో 12 ఏళ్ల వయస్సులో కూడా నిర్ధారణ అయితే వైద్యం చేయించేవారు. ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు మిగుల్చుకునేందుకు రెండేళ్లలోపు మూగ, చెవుడు ఉంటేనే ఆపరేషన్‌ చేస్తామంటున్నారు. 

గతంలో దివంగత నేత వైయస్‌ఆర్‌ పాలనలో 108కి ఫోన్‌ చేస్తే చాలు కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో మన ముంగిట వాలిపోయేది. ఇవాళ 108కి ఫోన్‌ కొడితే అసలు వస్తుందో, రాదో ఎవరికి తెలియడం లేదు. ఇవాళ ఆరోగ్యమిత్రలను తొలగించారు. ఆశా వర్కర్లకు దాదాపు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. అంబులెన్స్‌లో మందులు ఉండటం లేదు. ఇంతటి దారుణంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపిస్తున్న తీరులో ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం తలపెట్టాం. వైద్యం చేయించుకోలేక కిడ్నీ బాధితులు 422 మంది మృత్యువాత పడ్డారు. కిడ్నీలకు సంబంధించి ఓ ఏజెన్సీ 2012లో సర్వే మొదలు పెట్టింది. దాదాపు జిల్లాలో 56 మండలాల్లో 48 మండలాల్లో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉందని ఆ ఏజెన్సీ చెబుతోంది. 1122 గ్రామాల్లో 787 గ్రామాల్లో తీవ్రమైన స్థాయిలో ఉన్నాయని, ఫ్లోరైడ్‌ శాతం 5 శాతం దాటిపోయిందని వెల్లడించింది. దారుణంగా ఫ్లోరైడ్‌ శాతం పెరిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నా. 

నాడు వైయస్‌ఆర్‌ హయాంలో ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు, ఫ్లోరైడ్‌ నుంచి విముక్తి కలిగించేందుకు నల్గోండ జిల్లాలో రూ.1500 కోట్ల నిధులతో ఎస్‌ఎల్‌బీసీ నీళ్లను తీసుకొని మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి చూశామన్నారు. సాగర్‌ నీళ్లు తీసుకెళ్లారు. వైయస్‌ఆర్‌ కృషి వల్ల నల్గొండ జిల్లాలో ప్లోరైడ్‌ సమస్య తీరింది. ఇవాళ ఇక్కడ ఈ పరిస్థితి తీరలాంటే వెలుగోండ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందే. వెలుగొండ ప్రాజెక్టుకు వైయస్ఆర్ రూ.4700 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో బాబు ఈ ప్రాజెక్టును గాలికి వదిలేశారు. ఈ ప్రాజెక్టు కోసం 18 కిలోమీటర్ల స్వరంగం తవ్వించారు. మిగతా స్వరంగం తవ్వించే పరిస్థితి లేదు. అది పూర్తయితే ప్రకాశం జిల్లాకు నీళ్లు వస్తాయి. ఆ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఎక్కువ అంచనాలు పెంచి రూ.65 కోట్ల అదనంగా చెల్లించారు. అయినా ఆ కాంట్రాక్టర్‌ పనులు చేయడం లేదు. ఫ్లోరైడ్‌ నిర్మూలనకు మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు కొద్దో గొప్పో పనిచేస్తాయి. అయితే పూర్తిగా నిర్మూలించాలంటే ఆర్వో ప్లాంట్లు పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. రక్షిత నీరు తీసుకుని వస్తేనే ఇది సాధ్యమవుతుంది. 

మన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇక్కడి పరిస్థితులు చూసి తట్టుకోలేక రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పది లెటర్లు రాశారు. పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రధానిని కలిసినా ఫలితం లేదు. సాగర్‌ నీళ్లను ప్రతి గ్రామానికి అందించేందుకు ప్రతిపాదనలు రూరల్‌ డెవలప్‌ మంత్రికి ఇచ్చారు. ఆ ప్రతిపాదనలు రాప్ట్ర ప్రభుత్వానికి పంపితే ఇక్కడ స్పందన లేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుందో అర్థం కాని పరిస్థితి. బాబుపై ఒత్తిడి తీసుకొని వస్తేనే పలుకుతారు. జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి ప్రకాశం జిల్లాకు వస్తున్నాడని తెలుసుకొని అప్పుడు అంటే జగన్‌ రాకకు ఒక్క రోజు ముందు బాబుకు భయం పట్టుకుంది. 18–01– 17న జీవో విడుదల చేశారు. మార్కాపురం, కనిగిరి, కందుకూరు ప్రాంతాల్లో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని జీవోలు విడుదల చేశారు. ఒక డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకు రూ.10 లక్షలు అవుతుంది. అంటే రూ.10 లక్షలు ఖర్చు పెట్టడానికి వైయస్‌ జగన్‌ వచ్చే వరకు గుర్తు లేదు. వైవీ సుబ్బారెడ్డి డయాలసిస్‌ సెంటర్ల కోసం 2016 ఏప్రిల్‌లో రూ.12 లక్షలు ఇచ్చారు. జగన్‌ వస్తున్నాడని పేపర్లో వచ్చిన తరువాత బాబు మూడు డయాలసిస్‌లకు జీవోలు విడుదల చేశారు. జగన్‌ ఇక్కడికి వస్తే తప్ప పలకని పరిస్థితిలో ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. చనిపోయిన 422 మందిలో ఎక్కువ శాతం మంది పిల్లలే ఉన్నారు. కిడ్నీ సమస్యలపై చంద్రబాబు ఇప్పటికైనా స్పందించకుంటే చాలా ఉధృతంగా పోరాటం చేసి తీరుతాం.


–––––––––––––––––––––
సమ్స్, కిడ్నీ బాధితుడు
నాకు 20 ఏళ్లు వయసు. డయాలసిస్‌ వారానికి మూడు సార్లు చేయించుకోవాలి. వారానికి రూ.5 వేలు ఖర్చు అవుతుంది. ఆరోగ్యశ్రీలో డయాలసిస్‌ చేయమంటున్నారు. నేను మెకానిక్‌ పనిచేస్తున్నాను, నెలకు రూ.5 వేలు వస్తుంది. డయాలసిస్‌కు నెలకు రూ.20 వేలు ఖర్చు వస్తుంది. వాళ్ల నాన్న సంపాదించేది కూడా రూ.5 వేలే. వారానికి మూడు సార్లు చేయించుకోవాల్సిన డయాలసిస్‌ ఒక్కసారే చేయించుకుంటున్నారు. నెలకు రూ.2 వేలు అవుతుంది. ఇంజెక్షన్లకు రూ.2500 ఖర్చు అవుతుంది.

వైయస్‌ జగన్‌: ఇంతటి దారుణంగా ఉంది. ఫ్రీగా చేయించడమే కాకుండా చంద్రబాబు అనే వ్యక్తి సమ్స్‌కు బతకడానికి ఎంతో కొంత ఇవ్వాల్సింది పోయి డయాలసిస్‌కు డబ్బులు ఇవ్వడం లేదు.
–––––––––––
తిరుపతమ్మ, వరిమడి గ్రామం
రెండు కిడ్నీలు చెడిపోయాయి. మూడు సంవత్సరాలు మందులు తిన్నాను. నెల నెల మందులకు రూ.5 వేలు ఖర్చు అవుతుంది. నిన్ననే రెండు కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు చెబుతున్నారు. 

వైయస్‌ జగన్‌: మందుల కోసం డబ్బులిచ్చే పరిస్థితి లేదు. మూడేళ్లు గడిచిన తరువాత 19 ఏళ్ల వయసులో ఉన్న తిరుపతమ్మకు రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయని చెబితే ఆమె భయపడే పరిస్థితి నెలకొంది. వారానికి రూ. 5 వేల చొప్పున నెలకు రూ.20 వేలు ఎక్కడి నుంచి వస్తాయి. బాబు  టీవీ చూసి ఇప్పటినా జ్ఞానోదయం తెచ్చుకో
–––––––––––––––
వేణు
2007 నుంచి కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నా. 2010లో డయాసిస్‌ వచ్చింది. వైయస్‌ఆర్‌ హయాంలో గుంటూరులో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. దద్దమ్మ ఆరోగ్య మంత్రిని పెట్టారు. బస్సు పాసులు ఇవ్వడం లేదు. మందులు ఇవ్వడం లేదు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో చార్జీలకు డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు ఒంగోలులో చేయించుకుంటున్నాను. 

వైయస్‌ జగన్‌: 2007లో అప్పుడు ఆరోగ్య శ్రీ ఉండటంతో దేవుడి దయవల్ల వైద్యం అందింది. దాని వల్ల తనకు, తన కుటుంబానికి నెలకు రూ.20 వేలు మిగిలింది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మొదట మాత్రలు, తరువాత డయాలసిస్, ఆ తరువాత మందులు తినాల్సిన పరిస్థితి వస్తుంది. 422 మంది ఈ ప్రకాశం జిల్లాలో చనిపోయారంటే బాధకరం. నిన్న కనిగిరిలో ఇద్దరు చనిపోయారట. బాబు నిర్లక్ష్యం చేయడంతో అమాయకులు ప్రాణాలు కొల్పొతున్నారు. బాబు వైద్యం చేయించి ఉంటే 424 మంది చనిపోయే వారు కాదు. బాబు సిగ్గుతో తలదించుకోవాలి. చనిపోయిన బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.  వేణు బతకాలంటే డయాలసిస్‌తో పాటు నెలకు రూ.10 వేలు ఇవ్వాలి.
–––––––––––
ఎలియాజర్‌
డయాలసిస్‌ ఎక్కువ సార్లు చేసి, చేసి నరాలు కూడా చిక్కడం లేదు. మూడు సంవత్సరాలుగా డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. నెల్లూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. వారానికి రూ. 5 వేలు ఖర్చు అవుతుంది. మందులకు రూ.2 వేలు ఖర్చు అవుతోంది. నా వద్ద డబ్బులు లేక వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి. డబ్బులు లేక ఇప్పుడు పొట్ట ఉబ్బింది.  

వైయస్‌ జగన్‌: ఇప్పటికైనా మానవత్వం ఏ కొంచమైనా ఉన్నా కూడా బాబు మారాలి.
–––––––––––––––––
నరసమ్మ, రావిళ్లవారి పాలెం
డబ్బులు లేక ఆరు నెలలుగా డయాలసిస్‌ చేయించుకోలే ఆపేశాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. మందులు లేవు. నెలకు రూ.2 వేలు కావాలి. డయాలసిస్‌ చేయించే పరిస్థితి లేదు. నా భర్త కిడ్నీ సమస్యతో చనిపోయాడు.  నా కొడుకుకు కిడ్నీలు దెబ్బతిన్నాయి. రెండు ఎకరాలు పొలం అమ్మి వైద్యం చేయించుకున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా డయాలసిస్‌ చేయడం లేదు. ఆసుపత్రికి వెళ్తే రెండు మాత్రలు ఇస్తాం..ఇక వెళ్లిపో అంటున్నారు. మా వద్ద డబ్బులు లేవు. బాబుకు చెప్పేది ఏముంది ఇంతకంటే..ఆరు నెలలకు 9 మంది చనిపోయారు. 

వైయస్‌ జగన్‌: ప్రకాశం జిల్లాలో 5 శాతం ఫ్లోరైడ్‌ దాటిపోయింది. మందులు తినడంతో కిడ్నీలు ఫెయిలు అవుతున్నాయి. నిజంగా బాబుకు ఏ కాస్తా బుద్ధి, జ్ఞానం ఉంటే ఇక్కడ జరిగే పరిస్థితి చూసి చలించాలి. వీరికి నెలకు మందులకు రూ.5 వేలు, బతకడానికి భృతి చెల్లించాలి. బాబుకు బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని దేవున్ని  ప్రార్థిస్తున్నాం.
––––––––––––––––
భారీగా తరలివచ్చిన కిడ్నీ బాధితులు
పీసీపల్లె: తీవ్రంగా ప్రబలుతున్ను ఫ్లోరోసిస్‌ సమస్య . ఫ్లోరిన్‌ వ్యాధిన పడి కిడ్నీ సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. బాధితులను వైయస్‌ జగన్‌ పరామర్శించారు. వారికి డయాలసిస్‌ చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో మృతువాత పడుతున్నారు. వైయస్‌ జగన్‌కు బాధలు చెప్పుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన బాధితులు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో ఫ్లోరోసిస్‌ సమస్యతో ప్రజలు బాధపడుతున్నారు.  ఒకసారి డయాలసిస్‌ చేయాలంటే రూ.5వేలు ఖర్చు అవుతుంది. ఇలా నెలకు నాలుగు సార్లు చేయించుకోవాల్సి ఉంది. నెలకు డయాలసిస్‌కు రూ.20 వేలు ఖర్చు అవుతుంది.  వైయస్‌ జగన్‌ ప్రకాశం జిల్లాకు వస్తున్నారని తెలుసుకొని ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జీవో విడుదల చేశారు. అయితే ఎక్కడా, ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తారన్నది స్పష్టత లేదు. 

 

తాజా వీడియోలు

Back to Top