ఆ జిఓలు సరైనవైతే జగనెలా తప్పుచేసినట్టు?

భద్రాచలం (ఖమ్మం జిల్లా) : ప్రభుత్వం జారీ చేసిన 26 జీఓలు సరైనవే అయినప్పుడు తమ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎలా తప్పుచేసినట్టు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పువ్వాడ అజ‌య్‌కుమార్ ప్రశ్నించారు. భద్రాచలం రామాలయం సమీపంలో కోటి‌ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి అరెస్టు విషయంలో ప్రభుత్వ కుట్రలపై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై సిబిఐని పావుగా వాడుకుంటున్నాయని పువ్వాడ ఆరోపించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ వస్తుందన్న ప్రతిసారీ ప్రభుత్వం కుట్రలు చేసి దాన్ని అడ్డుకుంటోంద‌ని అజయ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ప్రధాన శత్రువని చెప్పుకుంటున్న టిడిపి ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్న వైనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీఈజీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధులు పాకాలపాటి చంద్రశేఖర్, సాని‌కొమ్ము బ్రహ్మారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు ఉప్పాడ ప్రసాదరెడ్డి, జక్కం సీతయ్య, విద్యార్థి, ఎస్టీ, రైతు విభాగం జిల్లా కన్వీనర్లు అయిలూరి మహేశ్వరరెడ్డి, భూక్యా దళ్‌సింగ్, ఎం. సత్యనారాయణ, కొవ్వూరి రాంబాబు, మానే రామకృష్ణ, పాయం వెంకయ్య, మంత్రిప్రగడ నర్సింహారావు, కడియం రామాచారి పాల్గొన్నారు.
Back to Top