600 కి.మీ. దాటిన షర్మిల పాదయాత్ర

అల్లీపురం (మహబూబ్ నగర్ జిల్లా): అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర 606 కిలో మీటర్లు కొనసాగింది. శుక్రవారం నాటికి 44 రోజులు కొనసాగిన పాదయాత్రలో దారి పొడవునా ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగుతున్నారు.

ఇడుపులపాయలో అక్టోబర్ 18న శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్ర కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల మీదుగా ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. పాలమూరు జిల్లాలో ఎనమిదో రోజు 17 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన శ్రీమతి షర్మిల ఈ ఘనత సాధించారు.  జిల్లాలోని మూలమల్ల గ్రామ శివారు ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఆత్మకూరు సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం అల్లీపురం గ్రామం వరకు పాదయాత్ర చేసిన శ్రీమతి షర్మిల రాత్రిక అక్కడే బస చేశారు.

Back to Top