500 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. పలమనేరు పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వెంకటేగౌడ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన టీడీపీ కీలకనేతలు ఎంవీ రాజశేఖర్‌ రెడ్డి అలియాస్‌ పెయింట్‌ రెడ్డి, బీఎస్‌ జగన్‌ 500 మంది అనుచరులతో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు పెద్దిరెడ్డి వారికి కండువాలను కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధినేత వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని చెప్పారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top