శ్రీకాకుళంః జననేత వైయస్ జగన్ ఆశయాలు,పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. తాజాగా జి.సిగడాం మండలం దవళపేటలో టీడీపీ నుంచి 50 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఎచ్చెర్ల వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ సమక్షంలో వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర్రానికి మంచి రోజులు రావాలంటే వైయస్ జగన్ సీఎం కావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైయస్ జగన్ వెంట నడిచి పార్టీ గెలుపునకు అహర్నిశలు శ్రమిస్తామన్నారు.