4న కొవ్వూరుకు విజయమ్మ

ఏలూరు:

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల నాలుగున వైయస్ఆర్ కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు కానుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ సభలో పాల్గొంటారు. గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత(టీడీపీ), కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల తెలుగుదేశం ఇన్చార్జులు కొఠారు రామచంద్రరావు, కర్రా రాజారావు కూడా వీరితో పాటు పార్టీలో చేరతారు. కృష్ణబాబు నేతృత్వంలో తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని తానేటి వనిత ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు గురువారం పరిశీలించారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ సీఈసీ సభ్యుడు కొయ్యా మోషెన్ రాజు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, తోట గోపి, తదితరులు వీరిలో ఉన్నారు.

Back to Top