<br/>అమరావతి: నిరుద్యోగ భృతిపై చంద్రబాబు హామీ నెరవేర్చలేదని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 48 గంటల నిరాహారదీక్షలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. విజయవాడలో విద్యార్థి సంఘం దీక్షలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మిగతా జిల్లాల్లో దీక్షలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేసిన విధానాన్ని విద్యార్థులు ఎండగడుతున్నారు.