2000 కిమీ కి గుర్తుగా 40 అడుగుల పైలాన్

ఏలూరు:
వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర ఆదివారం నాడు పశ్చిమ గోదావరి
జిల్లాలో ప్రవేశించనున్నదని రాజీనామా చేసిన ఎంపి వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ
ఆళ్ల నాని, పార్టీ సీనియర్ నాయకులు కోటగిరి శ్రీధర్ తెలిపారు. పాదయాత్ర రూట్ మ్యాప్
తదితర అంశాలను వారు మీడియాకు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 13
నియోజకవర్గాల్లో దాదాపు 250 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర సాగుతుందని వారు చెప్పారు.
అదే సందర్బంగా ఏలూరు మండలం వెంకటాపురం వద్ద ప్రజా సంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలు
రాయిని దాటనున్న సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వారు
వివరించారు. ఈ మైలురాయికు చిహ్నంగా ఏర్పాట చేస్తున్న 40 అడుగులు పైలాన్ ను వైయస్
జగన్ ఆవిష్కరిస్తారని వారు పేర్కొన్నారు. అటు తరువాత అదేరోజు ఎలూరు పాదబస్టాండ్
సెంటర్ లో బహిరంగసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top