<img style="width:200px;height:219px;margin:3px;float:left" src="/filemanager/php/../files/News/32sharmila.jpg">జూలకల్ 18 నవంబర్ 2012 : 'మరో ప్రజా ప్రస్థానం' లో షర్మిల 32వ రోజు పాదయాత్ర ముగిసింది. ఆదివారం షర్మిల 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రాత్రికి జూలకల్‌లో షర్మిల బస చేస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గం సి-బెళగల్ మండలంలోని నాలుగు ప్రధాన గ్రామాల గుండా షర్మిల పాదయాత్ర సాగుతోంది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర సి.బెళగల్, పోలకల్లు గుండా జూలకల్ చేరుకుంది. కాగా, ఇప్పటి వరకు 'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా షర్మిల 420.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.