27 నుంచి రంగారెడ్డిలో విజయమ్మ పర్యటన

హైదరాబాద్, 19 ఏప్రిల్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఈ నెల 27న పర్యటన ప్రారంభమవుతుంది. పర్యటన షెడ్యూల్‌ను పార్టీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ జనార్ధన్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 27న చేవెళ్లలో మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం శ్రీమతి విజయమ్మయాత్ర ప్రారంభిస్తారని చెప్పారు.  దివంగత మహానేత డాక్టర్  వైయస్‌ఆర్‌ ప్రతి కార్యక్రమాన్ని చేవెళ్ల నుంచే ప్రారంభించేవారని జనార్ధన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లాలో విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

Back to Top