200 టీడీపీ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

తూర్పు గోదావ‌రి: అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన 200 టీడీపీ కుటుంబాలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. తూర్పు గోదావ‌రి జిల్లా అంబాజీపేట మండలం వాకలగరువులో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు అధ్యక్షతన నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో వీరు పార్టీలో చేరారు. వారికి వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి కండువాలు వేసి సాద‌రంగా ఆహ్వానించారు. కార్య‌క్ర‌మంలో  నాయకులు ఎం.ఎం.శెట్టి, పేరి శ్రీనివాస్, దొమ్మేటి సాయికృష్ణ, నీతిపూడి విలసిత మంగతాయారు, నేతల నాగరాజు, కొర్లపాటి కోటబాబు, అడ్డగళ్ళ వెంకట సాయిరాం, వాసంశెట్టి తాతాజీ, మైలా ఆనందరావు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, నక్కా వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి వెంకట్రావు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, బూడిద వరలక్ష్మి, సుంకర రామకృష్ణ, జక్కంపూడి వాసు, పేరాబత్తుల చిన సుబ్బరాజు, జక్కంపూడి కిరన్, దంతులూరి శ్రీనివాసరాజు, ఎస్‌.కె.జాకీర్, వాసంశెట్టి వెంకన్న, దూనబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు గత ఎన్నికల్లో 650 హామీలు ప్రకటించి ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తానని మోసం చేశారన్నారు. చంద్రబాబు 43 నెలల్లో లక్ష కోట్ల రూపాయలు నిరుద్యోగులకు బాకీ పడ్డారన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓర్వలేక తమ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలే స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రత్యే క హోదా వస్తే రాష్ట్రంలో పన్నుల భారం తగ్గడమే కాక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.  . 


Back to Top