ప్రారంభమైన 191వ రోజు పాదయాత్ర

విశాఖపట్నం 26 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆమె చేపట్టిన పాదయాత్ర బుధవారానికి  191వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని కృష్ణాపురంలో ఆమె పాదయాత్రను  ప్రారంభించారు. పాదయాత్రలో మహానేత అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త బయ్యపురెడ్డిపాలెం, బలిగట్టం, ఆబిడ్‌ సెంటర్‌, నర్సీపట్నం, బొడ్డెపల్లి జంక్షన్‌, శ్రీరాంనగర్‌, లక్ష్మీపురం మీదుగా పాదయాత్ర సాగుతుంది. నర్సీపట్నం బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. ఇవాళ 12.2 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.

Back to Top