ముగిసిన 182వ రోజు షర్మిల యాత్ర

పెద్దాపురం 17 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం 182వ రోజు పాదయాత్ర పులిమేరు గ్రామం వద్ద ముగిసింది. అంతకుముందు పెద్దాపురం నియోజకవర్గంలోని  జి.రాగంపేట గ్రామంలో చెరకు రైతులు  శ్రీమతి షర్మిలను కలిశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చిన వెంటనే చెరకు పంటకు మద్దతు ధర ప్రకటించాలని వారామెకు విజ్ఞప్తి చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  చెరకు పంటకు మద్దతు లభించేదని రైతులు తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మద్దతు ధర రాకపోగా ఎరువుల ధరలు పెరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి శ్రీమతి షర్మిల ధైర్యం చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రయిన తర్వాత అందరి కష్టాలూ తీరతాయనీ, అంతవరకూ ఓపిక పట్టాలనీ ఆమె కోరారు.

Back to Top