16న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం

హైదరాబాద్, ‌14 సెప్టెంబర్‌ 2012: ఈ నెల 17నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో 16వ తేదీన వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. విద్యు‌త్ సంక్షోభం, ఫీజుల రీయింబ‌ర్స్‌మెంట్ పథకంపై పరిమితుల విధింపు, విషజ్వరాలు వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో ప్రజాపక్షంగా శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు చర్చిస్తారు. పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు విజయమ్మ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవుతారు.

Back to Top