మణ్యం ప్రజలను వణికిస్తున్న విష జ్వరాలు

తూర్పుగోదావరి జిల్లా: విష జ్వరాలు విజృంభించి మన్యం ప్రజలు మృత్యువాత పడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. 3 వారాల్లోనే 16 మందికిపైగా మరణించగా, మరో వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. గిరిజనుల దుస్థితిపై ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటున్న ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందన్నారు. తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ లేని దుస్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. రూ. కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్న ప్రభుత్వం అవి ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రజలు ప్రాణాలు కాపాడాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. 

Back to Top