రూ.150 కోట్ల ముడుపులు దండుకున్నాడు

  • చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ప్రజలను మభ్యపెడుతోంది
  • కాంట్రాక్టుల్లో బాబు, లోకేష్ లు దండుకుంటే..
  • ఆ తర్వాత మంత్రులు గిల్లుకుంటున్నారు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
విజయవాడః పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ప్రజలతో దోబూచులాడుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిథి కొలుసు పార్థసారథి ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్ కాస్ట్ విషయంలో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని అన్నారు.  ఏ లోన్ తీసుకున్నా మొట్ట మొదటి విడత ఇచ్చేటప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, పెట్టుబడి ఎంత, రుణం ఎంత అని స్పష్టంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారువుతుందని అన్నారు. కానీ అవేమీ చెప్పకుండా అంతా గోప్యంగా ఉంచుతోందని దుయ్యబట్టారు. విజయవాడలో మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ... తెలుగుదేశం ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు సంధించారు. నాబార్డు అప్పు చేసిన పోలవరం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత. 16వేల 200 కోట్ల రూపాయలా లేక 40వేల 200కోట్లా..? స్పష్టం చేయాలన్నారు. కాంట్రాక్టుల్లో బాబు, లోకేష్ లు దండుకుంటే, ఆ తర్వాత మంత్రులు గిల్లుకుంటున్నారని విమర్శించారు. 

ఒకసారి కాంట్రాక్ట్ ఇచ్చాక మెటీరియల్ కు సంబంధించింది ఏదైనా కాంట్రాక్టర్లు నిర్ణయించుకుంటారని, కానీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ పోలవరంకు 15 లక్షల టన్నుల సిమెంట్ అవసరముంది మీరు మా ఆఫీసుకు వచ్చి చర్చించండని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర రూ.150కోట్ల మూడుపులు తీసుకున్నారని ఆగ్రహించారు. ముడుపులు తీసుకోకపోతే నీవు సిమెంట్ డీలర్స్ తో చర్చించాల్సిన అవసరమేముందని దేవినేనిని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో దేవినేని ఉమ ల్యాండ్ విషయంలో అవతకలకు పాల్పడ్డారని తూర్పారబట్టారు.  బలహీన వర్గాల భూములకు 25, 30 లక్షలిచ్చి తనకు అనుకూలమైన వారికి 55లక్షలు ఇచ్చారని మండిపడ్డారు. ఆ రోజు వైయస్ఆర్ హయాంలో కాలువ తవ్వుతుంటే  కోర్టులో కేసులు వేయించి ప్రాజెక్ట్ అడ్డుకున్నాడు. ఇవాళ మళ్లీ రైతులకు సంబంధించిన 1,2 ఎకరాల రిజిస్ట్రేషన్ చూపించి ముడుపులు దండుకుంటున్నాడని ఆరోపించారు. బలహీన వర్గాలవారికి అన్యాయం చేశారని, దాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. 
Back to Top