14న తిరుపతిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ సమావేశం

తిరుపతి, 8 జూన్‌ 2013:

తిరుపతిలో ఈ నెల14న వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తున్నట్లు ‌పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ విధివిధానాల మీద ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా, మండల నాయకులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ముఖ్య అతిథి హాజరవుతారని‌ భూమన చెప్పారు.

Back to Top