139వ రోజు పాదయాత్ర ఇలా..

హైదరాబాద్, 04 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారానికి 139వ రోజుకు చేరుకుంది. మంగపేట నుంచి ప్రారంభమయ్యే యాత్ర బృందావనం, హెచ్ బీ కాలనీ వరకూ సాగిన తర్వాత శ్రీమతి షర్మిల భోజన విరామం తీసుకుంటారు. తదుపరి విద్యానగర్, ఎన్.కె. నగర్, పోస్టు ఆఫీసు సెంటర్ బస్సుస్టాండు మీదుగా రైల్వే స్టేషనుకు చేరుతుంది. అక్కడ బహిరంగా సభలో ప్రసంగించిన అనంతరం  బజారు సెంటరు, పాత డిపో, భజన మందిరం వరకుఉఉఉఉఉ సాగుతుంది. అక్కడ రాత్రి బస చేస్తారు. ఆదివారం మొత్తం 10.2 కిలోమీటర్లు నడుస్తారు.

తాజా ఫోటోలు

Back to Top