ద‌ళితుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌


- వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మేరుగు నాగార్జున‌
- వంద కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
గుంటూరు: ద‌ళితుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మేరుగు నాగార్జున పేర్కొన్నారు.  వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం యల్లవర్రు కి చెందిన 100 కుటుంబాలు మేరుగు నాగార్జున ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. వారికి మేరుగు నాగార్జున, యలవర్తి వీరవెంకట సుబ్బారావు,, యలవర్తి రామ్మోహన రావు పార్టీ కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల‌లో ద‌ళితుల‌పై దాడులు అధిక‌మ‌య్యాయ‌ని తెలిపారు. ప్రజల ధన, మానాలతో టిడిపి ఆడుకుంటోందని, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ పేరుతో మహిళలను వేధించారని ఆయన గుర్తుచేశారు. దళితులపై ప్రభుత్వం సామాజిక, ఆర్థిక దాడులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి గుణ‌పాఠం చెప్పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.
Back to Top