జగన్‌ సమైక్యాంధ్ర పోరాట పటిమ: ప్రవాసాంధ్రులు

ఓర్లాండ్ (ఫ్లోరిడా స్టేట్) :

సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాట పటిమ ప్రశంసనీయం అని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆయన నిరాహారదీక్ష చేయడం అభినందనీయం అన్నారు. నిజానికి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చిత్తశుద్ధితో పోరాడుతున్నది శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరేనని పలువురు వారు ప్రశంసించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ప్రవాసాంధ్రులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఓర్లాండ్ నగరంలో ‌ఇటీవలే సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో డా.ఎన్.వాసుదేవరెడ్డి, వై.సాయిప్రభాకర్, డా.కె.మోహన్‌రెడ్డి, డా.ఆదినారాయణ, డా.విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

Back to Top