నేడు పొగాకు రైతులతో వైయస్ జగన్ సమావేశం

  రైతుల సమస్యలు, ధరలు, మార్కెటింగ్ ఇబ్బందులపై చర్చ

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో బుధ‌వారం ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు   వైయస్ జగన్ పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. పొగాకు రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, పంటకు లభిస్తున్న ధర, మార్కెటింగ్‌లో ఎదురవుతున్న ఇబ్బందులు, రైతుల ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై ఈ సమావేశంలో వైయస్ జగన్ రైతులతో ముఖాముఖిగా చర్చించనున్నారు.

ఈ సమావేశానికి నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ పొగాకు రైతులు హాజరుకానున్నారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై వైయస్ జగన్ వారితో సమగ్రంగా చర్చించనున్నారు.
 

Back to Top