చిత్తూరు: తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వ నేతలు ఈ 100 రోజులు పదే పదే వైయస్ జగన్ గారిని తలుచుకున్నారంటేనే.. ప్రతిపక్షంగా మేము సక్సెస్ అయినట్లే అని వైయస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ మళ్లీ బలంగా వస్తుందనే భయం కూటమి నేతల మాటల్లో కనిపిస్తోందన్నారు. నారా చంద్రబాబు నాయుడు సూపర్-6 హామీలను అమలు చేయకుండా ఎలా మోసం చేస్తున్నాడో ప్రజలకి కూడా అర్థమవుతోందని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు.