డాల‌స్‌, అట్లాంటాల్లో వైఎస్ జ‌యంతి వేడుక‌లు

హైద‌రాబాద్‌: ద‌ఇవంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌యంతిని
పుర‌స్క‌రించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్ఆరై విభాగం, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి
అభిమానులు అమెరికాలోని ప‌లు ప్రాంతాల్లో వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని
నిర్ణ‌యించారు. ఈ నెల 11న డాల‌స్‌లో ,18న అట్లాంటాలో ఈ కార్య‌క్ర‌మాలు
ఏర్పాటు చేసిన‌ట్టు వైఎస్సార్‌సీపీ ఎన్నారై విభాగం నేత‌లు ఒక ప్ర‌క‌ట‌న‌లో
తెలిపారు. డ‌ల్లాస్‌లోని రుచి ప్యాలెస్ ఇండియ‌న్ క్యూజిన్‌లో 11వ తేదీ
రాత్రి 7 గంట‌ల‌కు జ‌రిగే జ‌యంతి కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌లో
అభిమానులు హాజ‌ర‌వుతార‌ని నిర్వాహ‌కులు తెలిపారు. అలాగే అట్లాంటాలోని
టేస్ట్ ఆఫ్ ఇండియాలో పెద్ద సంఖ్య‌లో వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, అభిమానులు ఈ
నెల 18న స‌మావేశ‌మై వైఎస్ శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తారు.
Back to Top