వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతుల భారీ ర్యాలీ

ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు

కృష్ణాజిల్లా: తుపాన్‌లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ నూజివీడు వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.తుపాన్‌ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా టీడీపీ ప్రభుత్వం  చెల్లించలేదని వైయస్‌ఆర్‌సీపీ నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు మండిపడ్డారు.  బాధితులకు రూ.12కోట్లు చెల్లించాల్సి వుందన్నారు. రైతులకు ఇవ్వలసిన సొమ్ము ఇవ్వకుండా నేడు కొత్తగా రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం మరో వంచనగా అభివర్ణించారు.  చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నూజివీడు ప్రాంతాన్ని  సస్యశ్యామలం చేస్తామని చెప్పిన టీడీపీ నాయకులు నేడు కనబడటంలేదన్నారు. ఇంతవరుకూ సేకరించిన భూములకు కూడా డబ్బులు చెల్లించలేదన్నారు.సుమారు 40 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు.కనీసం కాల్వలు కూడా పూర్తికాలేదన్నారు

Back to Top